Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌ను బీసీసీఐ ఎందుకు మర్చిపోయింది.. కారణం అదేనా..? నెట్టింట్లో విమర్శల వెల్లువ

కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. ఎప్పట్నుంచో జట్టులో స్థానంకోసం ఎదురు చూస్తున్న రుతురాజ్ గైక్వాండ్ ను మాత్రం పట్టించుకోలేదనే విషయంపై ..

Ruturaj Gaikwad

Border Gavaskar Trophy: బోర్డర్ -గావస్కర్ ట్రోపీలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం 18మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ టెస్టు జట్టులో హర్షిత్ రాణా, నితీశ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్ వంటి కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లకు బీసీసీఐ జట్టులో చోటు కల్పించలేదు. మహ్మద్ షమీ గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు.. మరోవైపు కుల్దీప్ గాయంతో బాధపడుతున్నాడు. గాయాల కారణంగా షమీ, కుల్దీప్ ను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేయలేదు. అయితే, రుతురాజ్ గైక్వాడ్ ను ఎందుకు ఎంపిక చేయలేదనే అంశంపై సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చ జరుగుతుంది.

Also Read: Team india: షమీకి దక్కని చోటు నితీశ్ కుమార్ ఎంట్రీ.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్లను ప్రకటించిన బీసీసీఐ

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కాకపోయినా.. దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరిగే టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులోనైనా రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ రెండు టీంలలోనూ గైక్వాడ్ కు అవకాశం దక్కకపోవడం పట్ల క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ విమర్శలు చేస్తున్నారు. అయితే, ఆసీస్ పర్యటనకు వెళ్లిన ఇండియా -ఏ జట్టుకు గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నారు. కానీ, కీలక సిరీస్ లకు అతడిని తీసుకోకపోవడం పట్ల సోషల్ మీడియాలో బీసీసీఐ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: IND vs NZ : చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్‌.. కోహ్లీ, రోహిత్, స‌చిన్‌, ధోని వ‌ల్ల కాలేదు..

కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. ఎప్పట్నుంచో జట్టులో స్థానంకోసం ఎదురు చూస్తున్న ఆటగాడిని మాత్రం పట్టించుకోలేదనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. రుతురాజ్ చేసిన తప్పేంటి..? అతడిని పక్కన పెట్టేందుకు గల కారణం ఏమిటి.. బీసీసీఐ దానికి సమాధానం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకేనా అతడికి అవకాశం ఇవ్వలేదని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఇటీవల కాలంలో భారత జట్టును సోషల్ మీడియా నిర్ణయించదని ఇప్పటికే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయినా సరే జట్ల ఎంపికపై చర్చ మాత్రం ఆగడం లేదు.

 


Can’t find Ruturaj Gaikwad anywhere in both squads. pic.twitter.com/e71Yv6Y8Si