Team india: షమీకి దక్కని చోటు నితీశ్ కుమార్ ఎంట్రీ.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్లను ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం.. దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్లను ప్రకటించింది.

Teamindia
Border Gavaskar Trophy : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే బోర్డర్ – గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. 18మంది సభ్యులతో కూడిన జట్టులో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వర్ లకు చోటు దక్కింది. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న షమీని జట్టుకు ఎంపిక చేయలేదు. నిన్నమొన్నటి వరకు షమి కోలుకుంటున్నాడని.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి వస్తాడని కథనాలు వచ్చాయి. కానీ, షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి జట్టులో అవకాశం కల్పించలేదు. అలాగే గజ్జల్లో గాయంతో కుల్దీప్ కూడా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కోసం ఎంపిక చేసిన అక్షర్ ను తప్పించి.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు.
Also Read: IND vs NZ : రెండో టెస్టులో పట్టుబిగించిన న్యూజిలాండ్.. 301 పరుగుల లీడ్
దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరగనున్న నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం కూడా 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ సారథ్యంలో సఫారీ జట్టుతో భారత్ జట్టు తలపడనుంది. పంజాబ్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్, కర్ణాటక సీమర్ విజయ్ కుమార్ వైశాక్ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ర్పీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత్ జట్టు :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ఆర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాళ్.
🚨 NEWS 🚨
Squads for India’s tour of South Africa & Border-Gavaskar Trophy announced 🔽#TeamIndia | #SAvIND | #AUSvIND pic.twitter.com/Z4eTXlH3u0
— BCCI (@BCCI) October 25, 2024