IND vs NZ : రెండో టెస్టులో పట్టుబిగించిన న్యూజిలాండ్.. 301 పరుగుల లీడ్
పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది.

Day 2 Stumps New Zealand lead by 301 runs in pune test
పూణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (9), టామ్ బ్లండెల్ (30) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశాడు. అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 ఆలౌట్ అయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
కెప్టెన్ ఇన్నింగ్స్..
103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే వాషింగ్టన్ సుందర్ షాకిచ్చాడు. 17 పరుగులు చేసిన డేవాన్ కాన్వేను ఎల్బీగా ఔట్ చేశాడు. విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), డారిల్ మిచెల్ (18) లు విఫలం అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కెప్టెన్ టామ్ లాథమ్ (86; 133 బంతుల్లో 10 ఫోర్లు) దూకుడుగా ఆడాడు.
IND vs NZ : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. కోహ్లీ, రోహిత్, సచిన్, ధోని వల్ల కాలేదు..
శతకానికి చేరువైన అతడిని సుందర్ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. గ్లెన్ ఫిలిప్స్, టామ్ బ్లండెల్ లు మరో వికెట్ పడకుండా రెండో రోజును ముగించారు. న్యూజిలాండ్ ఆధిక్యం మూడు వందలు దాటింది. ఇప్పటికే భారీ ఆధిక్యంతో కొనసాగుతున్న కివీస్ నాలుగో రోజు మరెన్ని పరుగులు చేస్తుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే ఏదైన అద్భుతం జరగాల్సిందే.
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 16/1 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ మరో 140 పరుగులు జోడించి మిగిలిన తొమ్మిది వికెట్లు కోల్పోయింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (38), యశస్వి జైస్వాల్ (30), శుభ్‌మన్ గిల్ (30) లు ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (1), రిషబ్ పంత్ (18), సర్ఫరాజ్ ఖాన్ (11), అశ్విన్ (4) లు ఘోరంగా విఫలం కావడంతో భారత్ 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లు తీశాడు. గ్లెన్ ఫిలిఫ్స్ రెండు వికెట్లు, టిమ్ సౌథీ ఓ వికెట్ సాధించాడు.
Stumps on Day 2
New Zealand extend their lead to 301 runs
Scorecard ▶️ https://t.co/3vf9Bwzgcd#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/uFXuaDb11y
— BCCI (@BCCI) October 25, 2024