New schedule for the upcoming T20 World Cup after Bangladesh venue change request Report
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే.. ఈ సమయంలో భద్రతా కారణాలను చూపిస్తూ భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడలేమని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. తమ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా నిర్వహించాలని కోరింది.
గత కొద్ది రోజులుగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ జట్టు నుంచి రిలీవ్ చేసింది. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక పరిపాలనలో ప్రముఖ వ్యక్తి అయిన ఆసిఫ్ నజ్రుల్, జాతీయ జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం వెంటనే వేదికను మార్చాలని బిసిబిని ఆదేశించారు.
Sneh Rana : టీమ్ఇండియా ప్లేయర్‌కు ముద్దు పెడుతున్న బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్..
ఈక్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఢాకాలో అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. గత కొద్ది గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు టీ20 ప్రపంచకప్ కోసం జట్టును భారత్‌కు పంపరాదని నిర్ణయం తీసుకుంది. ఒక్క ఆటగాడికే (ముస్తాఫిజుర్) రక్షణ కల్పించలేమని భారత్ చెబుతోంది. మరి మొత్తం జట్టుకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. అందుకనే భారత్‌లో ఆడలేమని, తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడతామని ఐసీసీకి లేఖ రాసింది.
ఇక బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకకు బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తరలించడానికి సముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ను సవరిస్తోందని, ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీసీ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Sara Tendulkar : సారా టెండూల్కర్ ఇయర్ బుక్ 2025.. జనవరి నుంచి డిసెంబర్ వరకు.. ఫోటోలు వైరల్
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కోల్‌కతాలో ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 17న ముంబయిలో నేపాల్‌తో పోటీపడనుంది. నేపాల్, ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్‌తో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది.
జట్టును ప్రకటించిన బీసీబీ..
టీ20ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఆదివారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లిటన్ దాస్ సారథ్యంలోనే ఈ మెగాటోర్నీలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది.
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టు ఇదే..
లిటన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమన్, తాంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.