టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పిన కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూస‌న్‌.. వీడియో వైర‌ల్

79 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

T20 World Cup 2024 : టీ20 క్రికెట్ ఫార్మాట్ లో అద్భుత బౌలింగ్ తో అరుదైన రికార్డును న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ నెలకొల్పాడు. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో భాగంగా గ్రూప్ -సీలో చివరి మ్యాచ్ సోమవారం రాత్రి పావువా న్యూగినీ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ ఫెర్గూసన్ అద్భుతమైన బౌలింగ్ తో కెనడా ఆటగాడు సాద్ బిన్ జాఫర్ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో పసికూన జట్టుపై విజయం సాధించింది.

Also Read : Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన బాబ‌ర్ ఆజాం.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్‌..

ఈ మ్యాచ్ లో తొలుత పాపువా న్యూగినియా జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే, న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి న్యూగినియా బ్యాటర్లు క్రీజులో నిలవలేక పోయారు. దీంతో 19.4 ఓవర్లలో కేవలం 78 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. ఫెర్గూసన్ అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. నాలుగు ఓవర్లు వేసిన ఫెర్గూసన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. నాలుగు ఓవర్లు మెయిడిన్ చేయగా.. మూడు వికెట్లు పడగొట్టాడు. టీ20 చరిత్రలో కెనడా కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ (4-0-4-2) నాలుగు ఓవర్లు వేసి నాలుగు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అతని రికార్డును ఫెర్గూసన్ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు (4-4-0-3) ను నెలకొల్పాడు.

Also Read : T20 World Cup 2024 : టీ20 ప్రపంచక‌ప్‌ సూపర్ -8లో ఆడే జట్ల వివరాలు.. మ్యాచ్‌ల‌ పూర్తి షెడ్యూల్ ఇదే..

79 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇదిలాఉంటే.. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ నుంచి లీగ్ దశలోనే న్యూజిలాండ్ ఇంటిబాట పట్టింది. సూపర్ -8కు అర్హత సాధించలేక పోయింది.

 

 

ట్రెండింగ్ వార్తలు