India enter WTC final-2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ఓడిపోయింది. దీంతో భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్‌కు చేరింది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో 148 పాయింట్లతో (68.52 శాతంతో) ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరింది. ఇవాళ న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో.. శ్రీలంక జట్టు పాయింట్లు పెరగలేదు.

India enter WTC final: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో శ్రీలంక ఓడిపోయింది. దీంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship -WTC) ఫైనల్‌కు చేరింది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో 148 పాయింట్లతో (68.52 శాతంతో) ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరింది. ఇవాళ న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో శ్రీలంక జట్టు పాయింట్లు పెరగలేదు.

ప్రస్తుతం శ్రీలంక జట్టు 64 పాయింట్లు(48.48 శాతంతో) నాలుగో స్థానానికే పరిమితం అయింది. ఇక ఆ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు లేవు. భారత్ ఇప్పటికే 123 పాయింట్లతో (60.29 శాతంతో) రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ తో శ్రీలంక మరో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచులో శ్రీలంక గెలిచినప్పటికీ ఆ జట్టు 52.78 శాతానికి మాత్రమే ఎగబాకుతుంది. భారత్ కు ఇప్పటికే 55.56 శాతం పాయింట్లు ఉన్నాయి. అందుకే శ్రీలంక ఫైనల్ వెళ్లే అవకాశాలు లేవు.

దక్షిణాఫ్రికా 100 పాయింట్లతో (55.56 శాతంతో) మూడో స్థానంలో ఉంది. దీంతో ఆస్ట్రేలియాతో ప్రస్తుతం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోన్న టెస్టు సిరీస్ తో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ కు వెళ్లింది. ఆ టెస్టులో టీమిండియా ఓడినా శ్రీలంక కంటే భారత్ కు ఎక్కువ పాయింట్లే ఉంటాయి. ఇకవేళ డ్రా అయితే టీమిండియా ఖాతాలో 58.80 శాతం పాయింట్లు చేరే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జూన్ లో ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్‌ జరగనుంది.

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో జట్ల పాయింట్లు

wtc final 2023

 

IND vs AUS 4th Test Match, LiveUpdates In Telugu: తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

ట్రెండింగ్ వార్తలు