కేన్ విలియమ్సన్‌ను వెంటాడిన దురదృష్టం.. ఎలా రనౌట్ అయ్యాడో చూడండి

టెస్టుల్లో టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను దురదృష్టం వెంటాడింది.

కేన్ విలియమ్సన్‌ను వెంటాడిన దురదృష్టం.. ఎలా రనౌట్ అయ్యాడో చూడండి

New Zealand vs Australia 1st Test Kane Williamson run out

Kane Williamson run out: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను దురదృష్టం వెంటాడింది. పరుగులేమి చేయకుండానే కేన్ మామా రనౌట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న విల్ యంగ్‌తో సమన్వయం కుదరకపోవడంతో రనౌటయి నిరాశగా మైదానాన్ని వీడాడు. స్టార్క్ బౌలింగ్ లో షాట్ కొట్టి సింగిల్ తీసేందుకు పరుగందుకున్నాడు. రన్ తీసే క్రమంలో విల్ యంగ్ చూసుకోకుండా విలియమ్సన్‌ను ఢీకొట్టాడు. విలియమ్సన్‌ తేరుకుని పరుగు పూర్తి చేసేలోపు లబూషేన్ డైరెక్ట్ హిట్‌తో వికెట్లను పడగొట్టాడు.

కేవలం 2 బంతులు మాత్రమే ఆడిన విలియమ్సన్‌ పరుగలేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. అయితే విలియమ్సన్‌ ఫ్యాన్స్ ఆసీస్ టీమ్ పై దుమ్ముత్తిపోస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు క్రీడాస్ఫూర్తిని శంకిస్తూ Justice for Kane Williamson పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విలియమ్సన్‌కు కావాలనే ఆసీస్ అడ్డుగా వచ్చారని ఆరోపిస్తున్నారు. కాగా, 2012 తర్వాత టెస్టుల్లో విలియమ్సన్‌ రనౌట్ కావడం మళ్లీ ఇప్పుడేనని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. విలియమ్సన్‌ రనౌట్‌లో ఎవరిది తప్పు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

 

వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 179 పరుగులకు ఆలౌటయింది. గ్లెన్ ఫిలిప్స్(71), మట్ హెన్రీ (42) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 4, హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టారు. మిచెల్ మార్ష్, కమిన్స్, స్టార్క్ తలో వికెట్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 4 పరుగులకే 2 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ స్టీవెన్ స్మిత్ డకౌటయ్యాడు.