Nicholas Pooran : నికోల‌స్ పూర‌న్ సిక్స‌ర్ల సునామీ.. గేల్ పుష్క‌ర కాలం రికార్డు క‌నుమ‌రుగు..

అమెరికాతో బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Nicholas Pooran – Chris Gayle : అమెరికాతో బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో సెమీ ఫైన‌ల్‌కు చేరుకోవాల‌నే త‌మ ఆశ‌ల‌ను విండీస్ సజీవంగా ఉంచుకుంది. ఇక విండీస్ విజ‌యంలో ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ నికోల‌స్‌ పూర‌న్ త‌న వంతు పాత్ర పోషించాడు. 12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు బాది 27 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో మాజీ వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్‌గేల్ ను అధిగ‌మించాడు. గేల్ 2012 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో 16 సిక్స‌ర్లు బాద‌గా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎడిష‌న్‌లో పూర‌న్ ఇప్ప‌టికే 17 సిక్స‌ర్లు బాదాడు. వీరిద్ద‌రి త‌రువాతి స్థానాల్లో మార్లోనో శామ్యూల్స్, షేన్ వాట్స‌న్ లు ఉన్నారు.

Gautam Gambhir : టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ మీరేనా..? గౌత‌మ్ గంభీర్ స‌మాధానం ఏంటంటే..?

ఓ ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్లు..

నికోల‌స్ పూర‌న్ (వెస్టిండీస్‌) – 17 సిక్స‌ర్లు (2024లో)
క్రిస్ గేల్ (వెస్టిండీస్‌) – 16 సిక్స‌ర్లు (2012లో)
మార్లోనో శామూల్స్ (వెస్టిండీస్‌) – 15 సిక్స‌ర్లు (2012లో)
షేన్ వాట్స‌న్ (ఆస్ట్రేలియా) – 15 సిక్స‌ర్లు (2012లో)
త‌మీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్‌) – 14 సిక్స‌ర్లు (2016లో)

ఇక విండీస్‌, అమెరికా మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో అమెరికా మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (16 బంతుల్లో 29), నితీశ్ కుమార్ (19 బంతుల్లో 20)లు రాణించారు. వెస్టిండీస్‌ బౌల‌ర్ల‌లో రోస్టన్ ఛేజ్, ఆండ్రీ రసెల్ లు చెరో మూడు, అల్జారీ జోసెఫ్ రెండు, మోతీ ఓ వికెట్‌ ప‌డ‌గొట్టారు.

Sania Mirza : ష‌మీతో సానియా మీర్జా పెళ్లి..? మౌనం వీడిన టెన్నిస్ స్టార్ తండ్రి

అనంత‌రం ల‌క్ష్యాన్ని విండీస్ 10.5 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో షైహోప్ (39 బంతుల్లో 82 నాటౌట్‌) మెరుపు హాఫ్ సెంచ‌రీ బాద‌గా, నికోల‌స్ పూర‌న్ (12 బంతుల్లో 27 నాటౌట్‌) వేగంగా ఆడాడు.

ట్రెండింగ్ వార్తలు