Nicholas Pooran : వామ్మో పూర‌న్ అస‌లు ఆగ‌డం లేదుగా.. టీ20ల్లో ప్ర‌పంచ రికార్డు

వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు నికోల‌స్ పూర‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Nicholas Pooran massive world record in T20 cricket

Nicholas Pooran : వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు నికోల‌స్ పూర‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. కరేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అత‌డు దీన్ని సాధించాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడ‌ర్స్ (టీకేఆర్‌)కు ఆడుతున్న పూర‌న్ సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 43 బంతులు ఎదుర్కొన్న అత‌డు 6 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో 93 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. అత‌డి విధ్వంసం కార‌ణంగా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు మ‌రో 9 బంతులు ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది.

150 సిక్స‌ర్లు..

సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్‌తో మ్యాచ్‌లో పూర‌న్ ఏడు సిక్స‌ర్ల‌ను బాదాడు. ఈ క్ర‌మంలో ఒక టీ20 క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో 150 సిక్స‌ర్లు కొట్టిన మొద‌టి ఆట‌గాడిగా పూర‌న్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 63 ఇన్నింగ్స్‌లు ఆడిన పూర‌న్ 151 సిక్స‌ర్ల‌ను కొట్టాడు.

Najmul Hossain : భార‌త్ పై ఓట‌మి.. బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్‌.. మేం ఓడిపోయినా..

ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు క్రిస్‌గేల్ రెండో స్థానంలో అత‌డు 2015లో 36 ఇన్నింగ్స్‌ల్లో 135, 2012లో 38 ఇన్నింగ్స్‌ల్లో 121 సిక్స‌ర్ల‌ను కొట్టాడు.

అత్య‌ధిక ప‌రుగులు..

టీ20ల్లో ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాట‌ర్‌గా కూడా పూర‌న్ ఘ‌న‌త సాధించాడు. 64 ఇన్నింగ్స్‌ల్లో 2022 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ బ్యాట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. 2021లో అత‌డు 48 ఇన్నింగ్స్‌ల్లో 2036 ప‌రుగులు న‌మోదు చేశాడు. అలెక్స్ హేల్స్ 61 ఇన్నింగ్స్‌లో 1946 ప‌రుగులతో మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌ల‌కు మొండిచేయి..