Nikhat Zareen: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన నిఖత్ జరీన్

Nikhat Zareen: క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన నిఖత్ జరీన్

Nikhat Zareen

Updated On : August 1, 2022 / 9:00 AM IST

 

 

Nikhat Zareen: వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఉమెన్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కామెన్వెల్త్ గేమ్స్ లో భాగంగా జరిగిన పోటీల్లో ఆదివారం 50కేజీల విభాగంలో మొజంబిక్ కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోను ఓడించింది. ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఒత్తిడి కనబరిచింది. లెఫ్ట్, రైట్ పంచులతో ప్రత్యర్థిపై అటాకింగ్ ప్రదర్శించింది.

ఫైనల్ రౌండ్ లో పూర్తిగా ముఖంపైనే పంచ్ లు విసిరి ప్రత్యర్థిని చిత్తు చేసింది. 48సెకన్ల సమయానికి ముందే గేమ్ ముగించింది. అలవోక విజయం సాధించి తదుపరి పోటీకి సిద్ధమైంది జరీన్. క్వార్టర్‌ఫైనల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత న్యూజిలాండ్‌కు చెందిన ట్రాయ్ గార్టన్‌తో తలపడనుంది.

షెయులీ స్వర్ణంతో, భారత వెయిట్‌లిఫ్టింగ్ బృందం గేమ్స్‌లో ఆరో పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు పురుషుల 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ లాల్ రిన్ముంగా స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Read Also: మరిన్ని విజయాలు సాధిస్తా: నిఖత్ జరీన్