Sanju Samson : పాపం సంజూ శాంస‌న్‌.. కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనా..?

మ‌రోసారి సంజూశాంస‌న్‌కు అన్యాయం జ‌రిగింద‌ని, ఇక అత‌డి కెరీర్ క్లోజ్ అయిన‌ట్లేన‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

No place for Sanju Samson in Duleep Trophy 2024

Sanju Samson – Duleep Trophy 2024 : మ‌రో 40 రోజుల వ‌ర‌కు టీమ్ఇండియాకు మ్యాచులు లేవు. సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో భార‌త జ‌ట్టు రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి సంజూశాంస‌న్‌కు అన్యాయం జ‌రిగింద‌ని, ఇక అత‌డి కెరీర్ క్లోజ్ అయిన‌ట్లేన‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఉన్న‌ట్లుండి ఇలా సంజూ ఎందుకు వైర‌ల్ అయ్యాడు అనేగా మీ డౌట్‌. అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి.

దేశ‌వాలీ సీజ‌న్ లో భాగంగా సెప్టెంబ‌ర్ 5 నుంచి ప్ర‌తిష్టాత్మ‌క దులీప్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం నాలుగు జ‌ట్ల‌ను బీసీసీఐ సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ మిన‌హా మిగిలిన స్టార్ క్రికెట‌ర్లు అంద‌రికి ఇందులో చోటు ద‌క్కింది. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరణ్, శ్రేయస్ అయ్యర్‌లను కెప్టెన్‌లుగా ఎంపిక చేశారు.

Vinesh Phogat : రెజ్లర్ వినేశ్ ఫోగట్‎కు నిరాశ.. పిటిష‌న్‌ తిర‌స్క‌రణ‌

అయితే.. సంజూ శాంస‌న్‌కు మాత్రం మ‌రోసారి మొండిచేయి చూపించారు. సెల‌క్ట‌ర్లు అత‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లుగా క‌నిపించ‌లేదు. వికెట్ కీపర్‌లుగా ధ్రువ్ జురెల్, ఎన్‌ జగదీషన్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లకు అవకాశం ఇచ్చారు. దీంతో సంజూ శాంస‌న్‌ను రెడ్ బాల్ క్రికెట్‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌నే సంకేతాలు సెల‌క్ట‌ర్లు ఇచ్చేశార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

అత‌డికి కూడా అవ‌కాశం ఇచ్చి ఉండాల్సింద‌ని అంటున్నారు. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో సంజూ శాంస‌న్‌కు రెండు టీ20 మ్యాచుల్లో ఆడే అవ‌కాశం వ‌చ్చింది. రాక‌రాక వ‌చ్చిన అవ‌కాశాల‌ను మ‌నోడు వృధాచేసుకున్నాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ డ‌కౌట్ అయ్యాడు. దీంతో అత‌డిని ఇక సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న బెట్టేశార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అత‌డిపై జాలి చూపిస్తున్నారు.

Manu Bhaker : నీర‌జ్ చోప్రాతో పెళ్లి.. అవును నేను విన్నాను : మ‌ను భాక‌ర్‌

టీమ్ఇండియా త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు సంజూ శాంస‌న్ 30 టీ20లు, 16 వన్డేలు ఆడాడు. టీ20ల్లో 444 ప‌రుగులు, వ‌న్డేల్లో 510 ప‌రుగులు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు