ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన జకోవిచ్

ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ ఏడో సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ రఫెల్ నాదల్‌ను వరుసగా 6-3, 6-2, 6-3 సెట్లలో ఓడించి టైటిల్ కొట్టేశాడు. టైటిల్ విజేతగా నిలిచిన జకోవిచ్ ఖాతాలో గ్రాండ్ స్లామ్‌ల సంఖ్య పెరిగింది.
ఇప్పటివరకూ ఆస్ట్రేలియా ఓపెన్ 6 టైటిళ్లతో అగ్రస్థానంలో రోజర్ ఫెదరర్ ఉండేవాడు. జకోవిచ్ ఖాతాలో ఇది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో పాటుగా గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లో నాదల్‌ను ఓడించిన మొదటి ప్లేయర్‌గా ఘనత సాధించాడు.