Novak Djokovic: చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో జకోవిచ్

ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన యూఎస్‌ ఓపెన్‌లో వరల్డ్ నెంబర్ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం మ్యాచ్‌లో..

Novak Djokovic: ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన యూఎస్‌ ఓపెన్‌లో వరల్డ్ నెంబర్ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జర్మనీ ప్లేయర్‌, నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో హోరాహోరీ సాగింది మ్యాచ్.

4-6, 6-2, 6-4, 4-6, 6-2తో జ్వెరెవ్‌ను చిత్తు చేశాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (జర్మనీ)తో పోటీ పడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టిస్తాడు. 52 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్‌ స్లామ్ గెలిచిన ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. 1969లో రాడ్ లావెర్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ గెలిచారు.

Naina Ganguly: నైనా.. అసలేంటీ రెచ్చగొట్టడం!

ఒలింపిక్ 2020లో నిరాశ:
టోక్యో విశ్వక్రీడల్లో నిరాశపరిచాడు జకోవిచ్. సెమీ ఫైనల్ మ్యాచ్​లో జ్వెరెవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. స్వర్ణం ఆశలు ఆవిరైన తరుణంలో కాంస్యమైనా వస్తుందనుకుంటే పాబ్లో కారెన్నో బూస్టాతో జరిగిన మ్యాచ్​లోనూ ఓటమి పాలయ్యాడు. దాదాపు రెండు గంటల 45 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్​లో జకో 4-6, 8-6, 3-6 తేడాతో పరాజయం చెందాడు.

UN Cyber Attack : ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి.. కీలక డేటా హ్యాక్.. ఎలా జరిగిందంటే?

ట్రెండింగ్ వార్తలు