UN Cyber Attack : ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి.. కీలక డేటా హ్యాక్.. ఎలా జరిగిందంటే?
ప్రపంచ దేశాల చర్చలకు వేదికైన ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు UNలోని కీలక డేటాను హ్యాక్ చేశారు. 2021 ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సైబర్ ఎటాక్ జరిగినట్టు గుర్తించారు.

Un Computer Networks Breached By Hackers Earlier This Year
UN Computer Networks Breached : ప్రపంచ దేశాల చర్చలకు వేదికైన ఐక్యరాజ్య సమితి (United Nations)పై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు యూనైటెడ్ స్టేట్స్ లోని కీలక డేటాను హ్యాక్ చేశారు. 2021 ఏడాదిలో ఏప్రిల్ నెలలో ఈ సైబర్ ఎటాక్ జరిగినట్టు గుర్తించారు. ఐక్యరాజ్య సమితిలోని సర్వర్లకు సంబంధించి సెక్యూరిటీ సిస్టమ్స్ ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అందులో పలు దేశాల మధ్య జరిగిన చర్చలతో పాటు అనేక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా హ్యాక్ అయినట్టు సమాచారం. ఐక్యరాజ‍్య సమితికి సంబంధించి పలు సెక్యూరిటీ సిస్టమ్స్‌లోని డేటాను గుర్తు తెలియని హ్యాకర్లు హ్యక్ చేశారని యూఎన్ సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ (Stéphane Dujarric) వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సైబర్ దాడిపై విచారణ కొనసాగుతోందని స్టీపెన్ పేర్కొన్నారు.
Read More : Afghan Govt: 9/11 రోజున జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసిన తాలిబాన్లు
UN నెట్‌వర్క్‌ను యాక్సస్ చేసేందుకు హ్యాకర్లు అధునాతనమైన పద్ధతి వినియోగించినట్టు కనిపించడం లేదు. డార్క్ వెబ్‌లో కొనుగోలు చేసిన UN ఉద్యోగికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా సైబర్ దాడికి పాల్పడి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఏప్రిల్ 2021లో ఐక్యరాజ్యసమితి మౌలిక సదుపాయాలలో కొన్నింటిపై సైబర్ దాడి జరిగినట్టు గుర్తించామని స్టీపెన్ ఒక ప్రకటనలో వెల్లించారు. ఐక్యరాజ్యసమితిపై సైబర్ దాడి లక్ష్యంగా గతంలోనూ అనేక దాడులకు సంబంధించి విషయాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. హ్యాక్ అయిన డేటా.. UN యాజమాన్య ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లోని అకౌంటుకు చెందినవిగా గుర్తించారు. దీనిని ఉమోజా (Umoja) అని పిలుస్తారు. ఇక్కడి నుంచే హ్యాకర్లు UN నెట్‌వర్క్‌కు యాక్సస్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్యూరిటీ గుర్తించింది.
UN సిస్టమ్‌లకు హ్యాకర్లు యాక్సస్ చేసుకున్న మొదటి తేదీ ఏప్రిల్ 5 కాగా.. ఆగస్ట్ 7 నాటికి నెట్‌వర్క్‌లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక డేటాను స్టోర్ చేసి ఉంచుతారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనేది అధికారులను షాకింగ్ గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాకర్ల సైబర్ దాడిపై విచారణ కొనసాగుతోంది. అందులోనుంచి ఎలాంటి డేటాను తస్కరించారు? భద్రతపరంగా ఏమైనా కీలకమైన డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందా? అనే కోణంలో యూఎన్ సెక్యూరిటీ స్టాఫ్ విచారిస్తోంది.
హ్యాకర్లు UN కంప్యూటర్ నెట్‌వర్క్‌లు ఎలా నిర్మించబడ్డాయనే దానిపై మరింత సమాచారాన్ని మ్యాప్ చేయడానికి ప్రయత్నించినట్టు గుర్తించారు. 53 UN అకౌంట్లను యాక్సస్ చేసేందుకు ప్రయత్నించారు. ఐక్యరాజ్య సమితిపై సైబర్ దాడికి హ్యాకర్లు ఎందుకు హ్యాక్ చేశారనేదానిపై ఇంకా గుర్తించాల్సి ఉంది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ డార్క్ వెబ్ ప్రకటనలను రివ్యూ చేస్తోంది.
Read More : Semiconductor Chips : ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్స్ కొరత