Pakistan Squad: వన్డే ప్రపంచ కప్ పాకిస్థాన్ స్క్వాడ్ ఇదే.. నసీమ్ షా ఔట్

పేసర్ హసన్ అలీ ప్రపంచ కప్ ద్వారా పాక్ టీమ్‌లో మళ్లీ చేరాడు. పాకిస్థాన్ బాబర్ అజామ్ సారథ్యంలో..

Pakistan Squad: వన్డే ప్రపంచ కప్ పాకిస్థాన్ స్క్వాడ్ ఇదే.. నసీమ్ షా ఔట్

@TheRealPCB

Pakistan Squad – World Cup 2023: భారత్‌లో అక్టోబరు 5 నుంచి జరగనున్న వన్డే (ODI) ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇవాళ తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఆసియా కప్‌లో గాయపడిన బౌలర్ నసీమ్ షాను ప్రపంచ కప్‌కు ఎంపిక చేయలేదు.

పేసర్ హసన్ అలీ ప్రపంచ కప్ ద్వారా పాక్ టీమ్‌లో మళ్లీ చేరాడు. ప్రపంచ కప్ లో పాకిస్థాన్ బాబర్ అజామ్ సారథ్యంలో ఆడనుంది. షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ తో పాక్ సెప్టెంబరు 29న వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.

ప్రపంచ కప్‌లో అక్టోబరు 6న నెదర్లాండ్స్‌తో పాక్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 1992లో పాకిస్థాన్ వన్డే ప్రపంచ కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో కప్ గెలవలేదు.

పాక్ స్క్వాడ్‌
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిదీ, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్

 Also Read : రూ.451 కోట్లతో వరణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… రేపు మోదీ శంకుస్థాపన