ODI Rankings Rohit Sharma Rises To No 2 Despite Not Playing Since March
Rohit Sharma Rises To No 2 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి స్థానంలో నిలిచాడు. టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానాన్ని (Rohit Sharma Rises To No 2) దక్కించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనే చివరి సారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గత ఐదు నెలలుగా అతడు మ్యాచ్‌లు ఆడలేదు. అయినప్పటికి కూడా రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం.
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) ఘోరంగా విఫలం అవ్వడం కూడా రోహిత్ శర్మకు కలిసి వచ్చింది. బాబర్ 5 రేటింగ్ పాయింట్లను కోల్పోయి 751 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. హిట్‌మ్యాన్ ఖాతాలో 756 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 15వ స్థానంలో నిలిచాడు.
రోహిత్ శర్మలాగానే కోహ్లీ కూడా చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనే ఆడాడు. వీరిద్దరు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన కోసం సన్నద్ధం అవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి 25 వరకు భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్..
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 784 రేటింగ్ పాయింట్లు
* రోహిత్ శర్మ(భారత్) – 756 రేటింగ్ పాయింట్లు
* బాబర్ అజామ్ (పాకిస్తాన్) – 751 రేటింగ్ పాయింట్లు
* విరాట్ కోహ్లీ (భారత్) – భారత్- 736 రేటింగ్ పాయింట్లు
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 720 రేటింగ్ పాయింట్లు
* చరిత్ అసలంక (శ్రీలంక) – 719 రేటింగ్ పాయింట్లు
* హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 708 రేటింగ్ పాయింట్లు
* శ్రేయస్ అయ్యర్ (భారత్) – 704 రేటింగ్ పాయింట్లు
* ఇబ్రహీం జద్రాన్ (భారత్) – 676 రేటింగ్ పాయింట్లు
* కుశాల్ మెండిస్ (శ్రీలంక) – 669 రేటింగ్ పాయింట్లు.