Pakistan vs England Match Prediction : పాక్ జట్టుకు అగ్నిపరీక్ష.. సెమీస్ కు చేరాలంటే ఇంగ్లాండ్ పై ఎన్ని పరుగులతో గెలవాలో తెలుసా? సాధ్యమవుతుందా..

ప్రపంచ కప్ లో టాప్ -8లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోపీ- 2025లో చోటు దక్కించుకుంటాయి. ఈ రోజు పాక్ పై జరిగే మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా చాంపియన్స్ ట్రోపీ-2025లోకి ప్రవేశించాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది.

Pakistan vs England Match

ODI World Cup 2023 PAK vs ENG : భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ చివరి దశకు చేరింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. ఫోర్త్ ప్లేస్ లో న్యూజిలాండ్ జట్టు దాదాపు సెమీస్ కు చేరినట్లే.. కానీ, ఈరోజు జరిగే పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో పాక్ జట్టు భారీ రన్ రేట్ తో విజయం సాధిస్తే సెమీస్ కు చేరే అవకాశాలు ఉంటాయి. న్యూజిలాండ్ తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఐదు విజయాలతో 10 పాయింట్లతో రన్ రేట్ 0.743తో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. పాకిస్థాన్ జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 0.036 రన్ రేటుతో ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు భారీ విజయం సాధిస్తే సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.

Also Read : Babar Azam : బాబ‌ర్ ఆజాంకు కోప‌మొచ్చింది..! టీవీల ముందు మాట్లాడ‌డం ఈజీ..

పాక్ సెమీస్ కు వెళ్లాలంటే?
న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై విజయం సాధిచండంతో పాకిస్థాన్ జట్టుకు దాదాపు సెమీస్ ఆశలు దూరమయ్యాయి. కానీ, శనివారం మధ్యాహ్నం 2గంటలకు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ విజయంతో సెమీస్ కు చేరే అవకాశాలు పాక్ జట్టుకు ఉన్నాయి. కివీస్ జట్టు సెమీస్ లో నాలుగో బెర్త్ కు చేరడం దాదాపు ఖాయమైందని చెప్పొచ్చు. ఒకవేళ పాకిస్థాన్ ఆ ప్లేస్ లోకి వెళ్లాలంటే శనివారం ఇంగ్లాండ్ పై జరిగే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఛేదనలో అయితే 284 బంతుల తేడాతో పాక్ విజయం సాధించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆటతీరు ఏ విధంగా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Also Read : FACT CHECK : స‌చిన్ టెండూల్క‌ర్ కాళ్లు మొక్కిన మాక్స్‌వెల్‌..? ఆ విధ్వంస‌క‌ర డబుల్ సెంచ‌రీ త‌రువాత‌..

ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోపీకి వెళ్తుందా .. 
ప్రపంచ కప్ లో టాప్ -8లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోపీ- 2025లో చోటు దక్కించుకుంటాయి. ఈ రోజు పాక్ పై జరిగే మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా చాంపియన్స్ ట్రోపీ-2025లోకి ప్రవేశించాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ జట్టు ఏడో స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ రెండు జట్లు చివరి మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో ప్లేస్ కు పడిపోతుంది. దీంతో ఛాంపియన్స్ ట్రోపీ 2025కు అర్హత కోల్పోతుంది. ఒకవేళ ఈరోజు పాకిస్థాన్ జట్టుపై జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే మిగిలిన జట్లతో పనిలేకుండా ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో రన్ రేట్ ను బట్టి ఆరు, ఏడు స్థానాల్లో ఉంటుంది. దీంతో ఈరోజు మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇంగ్లాండ్ జట్టు పట్టుదలతో ఉంది.

Also Read : Pakistan : పాకిస్థాన్ టీమ్ పై సెహ్వాగ్ సెటైర్లు.. దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయ్యుంటాదిగా..!

పాక్, ఇంగ్లాండ్ గత విజయాలు..
వన్డే ఫార్మాట్ లో ఇంగ్లాండ్ జట్టుకు పాక్ పై మెరుగైన రికార్డు ఉంది. ఈ రెండు జట్లు 91 వన్డే మ్యాచ్ లలో తలపడగా.. ఇంగ్లాండ్ జట్టు 56 విజయాలతో పైచేయిగా ఉంది. వరల్డ్ కప్ లో మాత్రం పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లాండ్ పై మెరుగైన రికార్డు ఉంది. మరోవైపు ఇంగ్లాండ్, పాక్ జట్లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ తలపడనున్నాయి. ఇక్కడ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. అయితే, మ్యాచ్ చివరి ఓవర్లలో పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు