Sri Lanka Cricket Board : శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. ఆదేశ క్రీడల శాఖ మంత్రి సంచలన నిర్ణయం.. ఎందుకంటే?

భారత్ జట్టుపై ఓటమి తరువాత మోహన్ డి సిల్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రాంగణం ఎదుట క్రికెట్ అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తుకూడా ఏర్పాుటు చేశారు.

Sri Lanka cricket

ODI World Cup 2023 : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో శ్రీలంక జట్టు సెమీస్ కు చేరడంలో విఫలమైంది. దీనికితోడు ఇటీవల భారత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో శ్రీలంక తలపడనుంది. ఈ నేథప్యంలో శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్ బోర్డును (ఎస్ఎల్సీబీ) తొలగిస్తున్నట్లు క్రీడా మంత్రి రోషన్ రణసింఘే ప్రకటించారు. వెంటనే తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. 1996 ప్రపంచకప్ ను గెలుచుకున్న మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నూతన తాత్కాలిక బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఏడుగురు సభ్యులతో ప్యానెల్ ఏర్పాటైంది. ఈ ప్యానెల్ లో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మాజీ బోర్డు అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 1973 లోని స్పోర్ట్స్ లా నెంబర్ 25 అధికారాల ప్రకారం రణసింఘే ఈ కమిటీని నియమించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

Also Read : ODI World Cup 2023 : ఈసారి టీమిండియా బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికి దక్కిందో తెలుసా.. ఈ వీడియో చూడండి

ఆర్థికంగా చితికిపోయిన శ్రీలంకలో అత్యంత ధనిక క్రీడా సంస్థ అయిన శ్రీలంక క్రికెట్ బోర్డులో కార్యదర్శిగా పనిచేస్తున్న మోహన్ డి సిల్వా రాజీనామా చేసిన మరుసటి రోజే క్రికెట్ బోర్డు రద్దు నిర్ణయం వెల్లడయింది. శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఈ విషయంపై మాట్లాడుతూ.. బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదని, తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేదని అన్నారు. బోర్డులో అవినీతి ఎక్కువైందని, దీంతో బోర్డును తొలగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. భారత్ జట్టుపై ఓటమి తరువాత మోహన్ డి సిల్వా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రాంగణం ఎదుట క్రికెట్ అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో భవనం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తుకూడా ఏర్పాుటు చేశారు.

Also Read : ODI World Cup 2023 : డ్రెస్సింగ్ రూంలో టీమిండియా సంబరాలు.. కోహ్లీ, జడేజా ఏం చేశారో తెలుసా.. వీడియో వైరల్

ఇదిలాఉంటే శనివారమే రణసింఘే శ్రీలంక బోర్డు సభ్యులపై ఫిర్యాదు చేస్తూ ఐసీసీకి లేఖ రాశారు. అందులో బోర్డు సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ ఉన్నాయని చెప్పడం గమనార్హం. అయితే, ఈ లేఖపై ఐసీసీ ఇంకా స్పందించలేదు.

ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు శ్రీలంక ఏడు మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈ జట్టుకు సెమీస్ అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఒకవేళ శ్రీలం జట్టు సెమీస్ కు వెళ్లాలంటే.. ఆ జట్టు ఆడే రెండు మ్యాచ్ లలోనూ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పటికీ ఇతర జట్లు.. న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.