Olympics : తెరపడనున్న ఒలింపిక్ సంబరాలు, చైనా ఆధిపత్యం..భారత్ చరిత్ర

విశ్వక్రీడా కోలాహలానికి నేటితో తెరపడనుంది. 17రోజుల పాటు ఆద్యంతం ఉత్కంఠబరితంగా సాగిన ఒలింపిక్స్‌లో.. యధావిధిగా చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది.

Olympics Closing Ceremony : విశ్వక్రీడా కోలాహలానికి నేటితో తెరపడనుంది. 17రోజుల పాటు ఆద్యంతం ఉత్కంఠబరితంగా సాగిన ఒలింపిక్స్‌లో.. యధావిధిగా చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. స్వర్ణ పతకంతో ఒలింపిక్స్ పోరాటాన్ని అద్భుతంగా ముగించగా… గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలను ఈ ఒలింపిక్స్‌లో సొంతం చేసుకుంది. అంచనాల్లేకుండా జావెలిన్ త్రో బరిలో దిగిన నీరజ్ చోప్రా…అనూహ్యంగా రాణించాడు.

Read More : Sravana Masam : శ్రావణ మాసం విశిష్టమైనది ఎందుకంటే….

కోట్లాది భారతీయుల కల నెరవేరస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. 2008లో అభినవ్ భింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలుచుకున్న తొలి ఆటగాడు నీరజ్ చోప్రానే. భారత్‌ పోటీకి శనివారం ఆఖరి రోజు.. హర్యానా నుంచే భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పునియా కాంస్యం గెలుచుకున్నాడు. కజకిస్థాన్‌కు చెందిన క్రీడాకారుడిపై భజరంగ్ గెలుపొందాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా భారత్‌ ఏడు పతకాలు దక్కించుకుంది. రెజ్లింగ్‌లోనే భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.

Read More : Opposition 3-Minute Video : మిస్టర్ మోడీ..మా మాట వినండి, 3 నిమిషాల వీడియో
57 కిలోల విభాగంలో రవికుమార్ దహియాకు రజతం దక్కగా.. భజరంగ్ 65 కిలోల విభాగంలో కాంస్యం దక్కించుకున్నాడు. టోక్యోలో తొలి పతకం మీరాబాయ్ చానుకు దక్కింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజతం సాధించింది. ఆ తర్వాత తెలుగు తేజం సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్యం గెలుచుకుంది. పురుషుల హాకీ జట్టు…జర్మనీపై గెలిచి 41 ఏళ్ల తర్వాత కాంస్యం గెలుచుకుంది.

Read More : Neeraj Chopra : అథ్లెటిక్స్‌లో నీరజ్‌దే తొలి స్వర్ణం

అసోంకు చెందిన లవ్లీనా బాక్సింగ్‌లో కాంస్యం గెలుచుకుంది. గోల్ఫ్‌లో అదితి చివరి వరకూ పోరాడినా చివర్లో అదృష్టం కలసి రాలేదు. విశ్వక్రీడల్లో చైనా తన ఆధిపత్యాన్ని పదర్శించింది. 38బంగారు, 31 సిల్వర్‌, 18కాంస్యాలతో మొత్తం 87పతకాలతో డ్రాగన్‌ కంట్రీ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా 108 పతకాలు సాధించగా.. చైనా కంటే రెండు పతకాలు తక్కువగా ఉండటంతో రెండోస్థానానికి సరిపెట్టుకుంది. అతిధ్య దేశం జపాన్‌ 56పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం సాయంత్రం విశ్వక్రీడా సంబరాలకు తెరపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు