Neeraj Chopra : అథ్లెటిక్స్‌లో నీరజ్‌దే తొలి స్వర్ణం

జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించారు. అయితే ఇది దేశానికి రెండో బంగారు పతకమని చాలామంది క్రీడా విశ్లేషకులతోపాటు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య కూడా అంటుంది. అయితే చోప్రా సాధించింది రెండవది కాదని మొదటిదే అని చరిత్రను తిరగేస్తే అర్ధమవుతుంది.

Neeraj Chopra : అథ్లెటిక్స్‌లో నీరజ్‌దే తొలి స్వర్ణం

Neeraj Chopra

Neeraj Chopra : జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించారు. అయితే ఇది దేశానికి రెండో బంగారు పతకమని చాలామంది క్రీడా విశ్లేషకులతోపాటు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య కూడా అంటుంది. అయితే చోప్రా సాధించింది రెండవది కాదని మొదటిదే అని చరిత్రను తిరగేస్తే అర్ధమవుతుంది.

1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో బ్రిటిష్ – ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ పరుగు పందెంలో రెండు బంగారు పతకాలు సాధించారు. అతడు భారత్ కు ప్రాతినిధ్యం వహించాడని చెబుతున్నా.. నాటి బ్రిటిష్‌ పాలనలో, స్వాతంత్య్రానికి 47 ఏళ్ల ముందు సాధించిన ఈ విజయానికి భారతీయత ఆపాదించడంలో అర్థం లేదని కొందరు క్రీడా నిపుణులు అంటున్నారు.

అయితే నార్మన్ ప్రిచర్డ్ సాధించిన పతకాలు బ్రిటన్ ఖాతాలోనే ఉన్నట్లు అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) 2005లో ప్రచురించిన అధికారిక ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ గణాంకాల్లో పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) మాత్రం తమ ఒలింపిక్‌ పతకాల జాబితాలో ప్రిచర్డ్‌ ప్రదర్శనను భారత్‌ ఖాతాలోనే ఉంచింది.