Shreyas Iyer : నువ్వు సూప‌ర్ అయ్య‌ర్.. జ‌ట్టులో వేరే వాళ్ల‌కి ఛాన్స్ ఇచ్చేందుకు ఇంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నావా?

టీమ్ఇండియాలో ప్ర‌స్తుతం విప‌రీత‌మైన పోటీ ఉంది.

Shreyas Iyer falls to short pitch delivery

టీమ్ఇండియాలో ప్ర‌స్తుతం విప‌రీత‌మైన పోటీ ఉంది. జ‌ట్టులో స్థానం కోసం యువ ఆట‌గాళ్లు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు. దీంతో ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయడం సెల‌క్ట‌ర్ల‌కు క‌త్తిమీద సాములా మారింది. ఇలాంటి స‌మ‌యంలో త‌నకు వ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి పోయి త‌న స్థానాన్ని చేజేతులా పోగొట్టుకునేలా ఉన్నాడు.

అత‌డు మ‌రెవ‌రో కాదు టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్. బీసీసీఐ ఆగ్ర‌హానికి గురై కొన్నాళ్ల పాటు భార‌త జ‌ట్టులో చోటు కోల్పోయిన అయ్య‌ర్ టీమ్ఇండియా కోచ్ గంభీర్ పుణ్య‌మా అని శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. అయితే.. వ‌న్డే సిరీస్‌లో పేల‌వ ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో కొట్టుకున్న పాక్‌ ఆట‌గాళ్లు ? కెప్టెన్ మ‌సూద్ వ‌ర్సెస్ అఫ్రిది.. మ‌ధ్య‌లో వెళ్లిన రిజ్వాన్‌కు దెబ్బ‌లు!

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో చోటు ద‌క్కించుకుని టెస్టుల్లోనూ త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని భావిస్తున్నాడు అయ్య‌ర్‌. ఈ క్ర‌మంలో బుచ్చిబాబు టోర్నీతో పాటు దులీఫ్ ట్రోఫీలోనూ రాణించి సెల‌క్ట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌ని అనుకున్నాడు. అయితే.. బుచ్చిబాబు టోర్నీలో త‌మిళ‌నాడుతో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అయ్య‌ర్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రెండు ప‌రుగులు చేసిన అయ్య‌ర్ రెండో ఇన్నింగ్స్‌లో 22 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అత‌డు చేసిన ప‌రుగుల కంటే ప్ర‌స్తుతం అత‌డు ఔటైన విధానం తీవ్ర చ‌ర్చ‌నీయాంశమైంది. షార్ట్ బాల్ శ్రేయ‌స్ అయ్య‌ర్ బ‌ల‌హీన‌త అన్న సంగ‌తి తెలిసిందే. దీని కార‌ణంగానే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో విఫ‌లం కావ‌డంతో టెస్టు జ‌ట్టులో అత‌డు చోటు కోల్పోయాడు. ఈ బ‌ల‌హీన‌త‌ను మెరుగుప‌ర‌చుకుని జ‌ట్టులో రీ ఎంట్రీ ఇస్తాడ‌ని భావిస్తుండ‌గా మ‌రోసారి అత‌డు షార్ట్ బాల్‌కే ఔటైయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Rahul Dravid : భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుకు ఎంపికైన రాహుల్ ద్ర‌విడ్ కొడుకు.. ఆనందంలో మాజీ కోచ్‌

దీంతో అభిమానులు అత‌డిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాగే ఆడుతూ ఉంటే టీమ్ఇండియాలో చోటు క‌ష్ట‌మేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇట్లానే ఔటైతే ఆఖ‌రికి గంభీర్ కూడా ఏమీ చేయ‌లేడ‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో త‌మిళ‌నాడు 268 ప‌రుగుల తేడాతో ముంబై పై ఘ‌న విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు