అమెరికా ఎయిర్ పోర్టుకు మొహమ్మద్ అలీ నామకరణం

అగ్రదేశం అమెరికాలోని ప్రధాన ఎయిర్ పోర్టుకు భారత బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ పేరుతో నామకరణం చేయనున్నారట. ప్రస్తుతం లూయీస్ విల్లే ఎయిర్ పోర్ట్‌గా కొనసాగుతున్న పేరును మార్చేందుకు లూయీస్ విల్లే రీజనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

అగ్రదేశం అమెరికాలోని ప్రధాన ఎయిర్ పోర్టుకు భారత బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ పేరుతో నామకరణం చేయనున్నారట. ప్రస్తుతం లూయీస్ విల్లే ఎయిర్ పోర్ట్‌గా కొనసాగుతున్న పేరును మార్చేందుకు లూయీస్ విల్లే రీజనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జూన్ నెల సమయానికి ఆ ఎయిర్ పోర్టు పేరు మారనుంది. 2016 సంవత్సరంలో తుది శ్వాస విడిచిన అలీ గురువారానికి 77 వసంతాలు పూర్తి చేసుకోవాల్సింది.

బాక్సర్ అలీ గౌరవానికి చిహ్నంగా ఆ సిటీలో ‘ఐ యామ్ అలీ’ అనే పండుగను జరుపుకుంటారట. ఈ ఎయిర్‌పోర్టు నామకరణం గురించి స్థానిక మీడియా ‘ముహమ్మద్ అలీ ప్రపంచ హీరో అయినా అతని సొంత ప్రాంతం మాత్రం ఇదే’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై స్పందించిన ఆయన సతీమణి లొనీ అలీ దేశానికే గర్వకారణమంటూ వ్యాఖ్యానించారు.

ముహమ్మద్ అలీ మానవత్వంలోనూ, అథ్లెట్‌గానూ చాలా మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. అతని పనుల ఫలితంగానే ఇంతటి అరుదైన సత్కారాన్ని అందుకుంటున్నారని లూయీస్ విల్లే రీజనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వ్యాఖ్యానించారు. మరికొద్ది వారాల్లో ఇందుకు సంబంధించిన పనులను ఆరంభిస్తామని తెలిపారు.