IPL 2023: ఈ ముగ్గురిలో ఆరెంజ్ క్యాప్ ఎవరికి? పక్కా అతడికే అంటున్న ఫ్యాన్స్

ఆరెంజ్ క్యాప్ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ కు దక్కే అవకాశాలే అధికంగా ఉన్నాయి.

Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రధానంగా ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. ఆర్సీబీ (RCB) బ్యాటర్ డు ప్లెసిస్ (Faf Du Plessis) ఈ సీజన్ లో మొత్తం 730 పరుగులు చేశాడు. ఇప్పటివరకు అతడు అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ అతడు, అతడి జట్టు ఆర్సీబీ ఫ్లేఆఫ్స్ కు చేరుకోలేకపోయింది.

దీంతో మిగతా మ్యాచుల్లో డు ప్లెసిస్ ఆడడు. గుజరాత్ టైటాన్స్ శుక్రవారం క్వాలిఫయర్ 2 మ్యాచు ఆడాల్సి ఉంది. ఆ జట్టు బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే 722 పరుగులు చేశాడు. మరో 9 పరుగులు చేస్తే అతడి పరుగులు డు ప్లెసిస్ కన్నా ఎక్కువగా నమోదవుతాయి. దీంతో గిల్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉంటాడు.

అంతేకాదు, ఈ రేసులో మూడు, నాలుగు, అయిదవ స్థానాల్లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ (639), రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (625), సీఎస్కే బ్యాటర్ కాన్వే (625 పరుగులు) ఉన్నారు. ఆరవ స్థానంలో సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 564 పరుగులతో ఉన్నాడు.

ఆర్సీబీ, ఆర్ఆర్ ఇప్పటికే ఐపీఎల్ నుంచి నిష్క్రమించడంతో కోహ్లీ, జైస్వాల్ కూడా ఆరెంజ్ క్యాప్ పోటీలో లేరు. ఇక మిగిలింది. సీఎస్కే బ్యాటర్లు కాన్వే, రుతురాజ్ గైక్వాడ్. కాన్వే కన్నా గిల్ ఖాతాలో 97 పరుగులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గిల్ కు ఆరెంజ్ క్యాప్ దక్కడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

IPL 2023: ఎలిమినేటర్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. Updates In Telugu

ట్రెండింగ్ వార్తలు