over 24000 fans turning up for an India A vs Australia A one day match
India A vs Australia A : ఆదివారం (అక్టోబర్ 5న) భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా అనధికారిక మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అంతర్జాతీయ మ్యాచ్ స్థాయిలోనే ప్రేక్షకులు రావడం విశేషం. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 24 వేలకు పైగా ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు.
‘కాన్పూర్‌లో ఎంత అద్భుతమైన దృశ్యం ఇది.. భారత్-ఏ వర్సెస్ ఆస్ట్రేలియా-ఏ వన్డే మ్యాచ్ చూసేందుకు 24000 పైగా ఫ్యాన్స్ వచ్చారు. సాధారణంగా భారత్-ఏ ఆడే మ్యాచ్‌లను చూసేందుకు ఈ స్థాయిలో జనాలు రావడం చాలా అరుదు. ఇది ఆట పట్ల పెరుగుతున్న ప్రేమ, కాన్పూర్ ప్రజల అభిరుచికి నిదర్శనం.’ అని రాజీవ్ శుక్లా అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
Visakhapatnam stadium : విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
ఇదిలా ఉంటే.. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియాలు ఖాళీగా ఉన్న దృష్ట్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిదే. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టెస్టులకు ఆదరణ లభించే స్టేడియాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించాలని కోరారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ లేని స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం పై బీసీసీఐని విమర్శించారు.
ఇక భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక మూడో వన్డే మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియా-ఏ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 49.1 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటూంది. ఆసీస్ బ్యాటర్లలో జాక్ ఎడ్వర్డ్స్ (89), లియామ్ స్కాట్ (73), కూపర్ కొన్నోలీ (64) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు చెరో మూడు వికెట్లు తీశారు. ఆయుష్ బదోని రెండు వికెట్లు సాధించాడు.
Fatima sana : అందుకే భారత్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా హాట్ కామెంట్స్..
What an incredible sight in Kanpur – over 24,000 fans turning up for an India A vs Australia A one-day match. India A games rarely draw such crowds. A true testament to the growing love for the game and the incredible passion of the people of Kanpur. @BCCI pic.twitter.com/ILspkOIp4k
— Rajeev Shukla (@ShuklaRajiv) October 5, 2025
ఆ తరువాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (68 బంతుల్లో 102 పరుగులు) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (62), రియాన్ పరాగ్ (62)లు అర్థశతకాలతో చెలరేగడంతో 318 పరుగుల లక్ష్యాన్ని భారత్-ఏ 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.