PAK vs SA 1st test Ramiz Raja controversy with drama karega comment on Babar Azam
Ramiz Raja : అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ ఆజామ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతడు 23 పరుగులు మాత్రమే చేశాడు. మంచి ఆరంభం లభించినప్పటికి దాన్ని భారీ స్కోరుగా మలచడంలో మరోసారి విఫలం అయ్యాడు. అయినప్పటికి కూడా అతడు ఓ రికార్డును అందుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఆసియా దేశాల నుంచి 3వేల పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో బాబర్ బ్యాటింగ్ చేస్తుండగా పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా (Ramiz Raja)చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమీజ్ వ్యాఖ్యలపై బాబర్ అభిమానులు మండిపడుతున్నారు.
ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను దక్షిణాఫ్రికా స్పిన్నర్ సెనురాన్ ముత్తుసామి వేశాడు. అప్పుడు బాబర్ ఒక్క పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్‌లోని మొదటి బంతిని బాబర్ డిఫెన్స్ ఆడాడు. బంతి బ్యాట్‌ను తాకిందని భావించిన సఫారీ ఫీల్డర్లు ఔట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
Ramiz raja trolling Babar Azam “ye out hoga to drama karega” 😭😂😂 #PAKvSA #BabarAzam pic.twitter.com/Lde4bp0xX3
— Qudart_Ka_Nizaam__𓃵__93000 (@43_49_53_all0ut) October 12, 2025
వెంటనే బాబర్ రివ్య్వూ తీసుకున్నాడు. సమీక్షలో నాటౌట్‌గా తేలింది. అయితే.. ఈ సమయంలో రమీజ్ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది ఖచ్చితంగా ఔట్.. కానీ అతడు ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తాడు. డీఆర్ఎస్ వృథా అని అన్నాడు. ప్రస్తుతం అతడి మాటలు వైరల్ అవుతుండగా సోషల్ మీడియాలో బాబర్ అభిమానులు రమీజ్ పై మండిపడుతున్నారు. అయితే.. ఇక్కడ రమీజ్ తన మైక్ ఆఫ్‌లో ఉందని అనుకుని మాట్లాడి ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అలీ అఘా (52) లు క్రీజులో ఉన్నారు. ఇమామ్ ఉల్ హక్ (93), కెప్టెన్ షాన్ మసూద్ (76) హాఫ్ సెంచరీలు చేశారు.