PAK vs ZIM Babar Azam surpasses Shahid Afridi on unwanted T20I list
Babar Azam : పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ ఓ అవాంఛనీయ రికార్డుకు చాలా చేరువగా ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచేందుకు బాబర్ ఆజామ్ చాలా చేరువగా వచ్చాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బాబర్ డకౌట్ అయ్యాడు. మూడు బంతులు ఆడిన అతడు బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బాబర్‌కు (Babar Azam) ఇది 9వ డకౌట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో అతడు పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు. అఫ్రిది 90 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు పరుగులు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక పాక్ ఆటగాళ్లలో అత్యధిక సార్లు అంతర్జాతీయ టీ20లో డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సైమ్ ఆయూబ్, ఉమర్ అక్మల్‌లు మాత్రమే బాబర్ కన్నా ముందు ఉన్నారు. వీరిద్దరు చెరో 10 సార్లు పరుగుల ఖాతా తెరవలేదు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ ఆటగాళ్లు వీరే..
* సైమ్ అయూబ్ – 10 సార్లు (50 ఇన్నింగ్స్‌ల్లో)
* ఉమర్ అక్మల్ – 10 సార్లు (79 ఇన్నింగ్స్‌ల్లో)
* షాహిద్ అఫ్రిది – 8 సార్లు (90 ఇన్నింగ్స్‌ల్లో)
* కమ్రాన్ అక్మల్ – 7 సార్లు (53 ఇన్నింగ్స్‌ల్లో)
* మహ్మద్ హఫీజ్ – 7 సార్లు (108 ఇన్నింగ్స్‌ల్లో)
* మహ్మద్ నవాజ్ – 7 సార్లు (58 ఇన్నింగ్స్‌ల్లో)
ఇక పాక్, జింబాబ్వే మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ (49), సికందర్ రాజా (34 నాటౌట్) లు రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
IND vs SA : భారత్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా మాస్టర్ ప్లాన్.. స్టార్ పేసర్‌కు చోటు..
ఆ తరువాత 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (44), ఉస్మాన్ ఖాన్ (37 నాటౌట్)లు రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు వికెట్లు తీశాడు.