IND vs SA : భారత్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా మాస్టర్ ప్లాన్.. స్టార్ పేసర్‌కు చోటు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) గౌహతి వేదికగా శనివారం (నవంబర్ 22) నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
IND vs SA Lungi Ngidi added to South Africa squad for second Test against India
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గౌహతి వేదికగా శనివారం (నవంబర్ 22) నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు మ్యాచ్ గెలిచి మంచి ఊపుమీదున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. స్టార్ పేసర్ లుంగి ఎంగిడిని జట్టులోకి తీసుకుంది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు పేసర్ కగిసో రబాడ అకస్మాత్తుగా గాయపడి జట్టుకు దూరం అయ్యాడు. దీంతో చివరి క్షణాల్లో సఫారీ జట్టు తమ తుది జట్టు ప్రణాళికలను మార్చుకుంది.
IND vs BAN : భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా..?
కాగా.. అందుతున్న సమాచారం ప్రకారం రబాడ ఇంకా కోలుకోలేదని, ఈ క్రమంలోనే అతడి స్థానంలో లుంగి ఎంగిడి తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. రబాడ పక్కటెముకల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది.
లుంగి ఎంగిడి చివరిగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలబెట్టడంలో తన వంతు సాయం చేశాడు. ఇదిలా ఉంటే.. ఎంగిడి ఇప్పటి వరకు భారతదేశంలో కేవలం ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు.
2018లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో లుంగి ఎంగిడి అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 20 టెస్టులు మాత్రమే ఆడాడు. 58 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
