IND vs SA : గౌహ‌తి వేదిక‌గా రెండో టెస్టు.. అరుదైన రికార్డు పై ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ బ‌వుమా క‌న్ను..

భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల (IND vs SA ) మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జ‌రుగుతోంది.

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా రెండో టెస్టు.. అరుదైన రికార్డు పై ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ బ‌వుమా క‌న్ను..

IND vs SA 2nd Test Temba Bavuma eye on huge milestone in Guwahati test

Updated On : November 18, 2025 / 4:21 PM IST

IND vs SA : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జ‌రుగుతోంది. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా పై ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. దీంతో ప్ర‌స్తుతం స‌ఫారీలు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్నారు. ఇక గౌహ‌తి వేదిక‌గా శ‌నివారం (న‌వంబ‌ర్ 22) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో బ‌వుమా 31 ప‌రుగులు చేస్తే.. ద‌క్షిణాఫ్రికా త‌రుపున కెప్టెన్‌గా 1000 ప‌రుగులు పూర్తి చేసుకుంటాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌వుమా 11 టెస్టుల్లో ద‌క్షిణాఫ్రికాకు నాయ‌క‌త్వం వ‌హించాడు. 57 స‌గ‌టుతో 969 ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, ఆరు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక బ‌వుమా సార‌థ్యం వ‌హించిన టెస్టుల్లో 10 మ్యాచ్‌ల్లో స‌ఫారీలు విజ‌యం సాధించారు. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Babar Azam : బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాక్‌.. దెబ్బ‌కు సెంచ‌రీ మ‌త్తు వ‌దిలింది..!

ద‌క్షిణాఫ్రికా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన కెప్టెన్లు వీరే..

* గ్రేమ్ స్మిత్ – 8647 పరుగులు
* హాన్సీ క్రోన్జే – 2833 పరుగులు
* ఫాఫ్ డు ప్లెసిస్ – 2219 పరుగులు
* హెచ్‌డబ్ల్యూ టేలర్ – 1487 పరుగులు
* ఎడి నూర్స్ – 1242 పరుగులు
* టిఎల్ గొడ్దార్డ్ – 1092 పరుగులు

IND vs SA : గిల్ దూరం అయితే.. సాయి సుద‌ర్శ‌న్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ వ‌ద్దు.. ఇత‌డిని తీసుకోండి..

* డిఎల్ మెక్‌గ్లెవ్ – 1058 పరుగులు
* కెసి వెస్సెల్స్ – 1027 పరుగులు
* షాన్ పొల్లాక్ – 998 పరుగులు
* టెంబా బావుమా – 969 పరుగులు