Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభ వేడుకలో సందడిచేసే అందగత్తెలు ఎవరో తెలుసా?

ఆసియా కప్-2023 టోర్నీ బుధవారం సాయంత్రం ప్రారంభం కానుంది. సాయంత్రం 3గంటలకు పాకిస్థాన్ - నేపాల్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.

Asia Cup 2023, Asia Cup 2023 Opening Ceremony, Aima Baig, Trishala Gurung, Multan Cricket Stadium

Asia Cup 2023 Opening Ceremony : ఆసియా కప్-2023 టోర్నీ బుధవారం సాయంత్రం ప్రారంభం కానుంది. సాయంత్రం 3గంటలకు పాకిస్థాన్ – నేపాల్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. అయితే, మ్యాచ్ ప్రారంభంకు ముందు టోర్నమెంట్‌కు సంబంధించి ప్రారంభ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో పాకిస్థానీ గాయని ఐమా బేగ్, నేపాల్ కు చెందిన త్రిషాలా గురుంగ్ సందడి చేయనున్నారు.

Asia Cup 2023: ఆసియా కప్‌కు వేళైంది.. ఇవాళ పాకిస్థాన్ వేదికగా తొలి మ్యాచ్.. టోర్నీలో మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇలా ..

15ఏళ్ల తరువాత పాకిస్థాన్ తొలిసారిగా అతిథ్యం ఇవ్వబోతున్న ఈ టోర్నీ ప్రారంభోత్సవంలో పాకిస్థానీ ప్రఖ్యాత గాయని ఐమా బేగ్, నేపాలీ గాయని త్రిషాలా గురుంగ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఐమా బేగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పాకిస్థాన్ లో ఆమె ప్రసిద్ధ గాయకురాలు. తిషాలా ఇన్ స్టాగ్రామ్ లో 239,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసియా కప్ -2023 ప్రారంభ వేడుకల గురించి పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి (పాకిస్థాన్ కాలమానం ప్రకారం) టోర్నీ ప్రారంభ వేడుకలు మొదలవుతాయని ప్రకటించింది.

Asia Cup 2023: భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిందో తెలుసా? వన్డే ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ ఆ జట్టుదే!

ఆగస్టు 30న ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్ 2023 కర్టెన్ రైజర్‌ను ప్రత్యక్షంగా చూడండి.. పాకిస్థాన్‌కు చెందిన ఐమా బేగ్, నేపాల్‌కు చెందిన త్రిషాలా గురుంగ్‌ల ప్రత్యక్ష ప్రదర్శనలు ఆస్వాదించండి, ఆ తరువాత పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ ఉంటుంది అంటూ పీసీబీ ట్విటర్ లో పేర్కొంది.