Asia Cup 2023: భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిందో తెలుసా? వన్డే ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ ఆ జట్టుదే!

ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు 15 టోర్నీలు జరిగాయి. ఇందులో 13 టోర్నీలు వన్డే ఫార్మాట్లలో, రెండు సార్లు టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరిగాయి.

Asia Cup 2023: భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిందో తెలుసా? వన్డే ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ ఆ జట్టుదే!

Asia cup

Asia Cup 2023 Match: ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ -2023 టోర్నీ జరుగుతుంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్ – నేపాల్ జట్ల మధ్య సాయంత్రం 3గంటలకు జరుగుతుంది. ఈ టోర్నీలో సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం ఆరు టీంలు పాల్గొంటుండగా.. 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఆసియా కప్ -2023కు పాకిస్థాన్ ఆతిధ్యమిస్తుంది. దీంతో పాకిస్థాన్ లోని ముల్తాన్ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి.

Asia Cup 2023: ఆసియా కప్‌కు వేళైంది.. ఇవాళ పాకిస్థాన్ వేదికగా తొలి మ్యాచ్.. టోర్నీలో మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇలా ..

భారత్ ఏడు సార్లు గెలిచింది ..

ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు 15 టోర్నీలు జరిగాయి. ఇందులో 13 టోర్నీలు వన్డే ఫార్మాట్లలో, రెండు సార్లు టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరిగాయి. ప్రస్తుతం జరిగేది 16వ ఆసియా కప్. ఇదిలాఉంటే.. టీమిండియా ఏడు సార్లు ఆసియాకప్ లో విజేతగా నిలిచింది. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 (టీ20), 2018 సంవత్సరాల్లో ఆసియా కప్ ట్రోపీని టీమిండియా దక్కించుకుంది. 1984 నుంచి మొదలుకొని టీమిండియా ఈ టోర్నీలో మొత్తం 40 వన్డేలు ఆడింది. వాటిలో 31 వన్డేలు గెలిచింది.

Asia Cup 2023 : టీమ్ఇండియాకు భారీ షాక్‌.. పాక్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం

వన్డే ఫార్మాట్లో రికార్డులు ..

ఆసియా కప్ చరిత్రలో 13 సార్లు వన్డే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరిగాయి. ఈ క్రమంలో ఆయా జట్ల ప్లేయర్స్ సరికొత్త రికార్డులను నమోదు చేశారు.
– శ్రీలంక మాజీ ప్లేయర్ మురళీధరన్ ఆసియాకప్ టోర్నీల్లో 30 వికెట్లు పడగొట్టిన వ్యక్తిగా అగ్రస్థానంలో ఉన్నారు.
– ఆసియా కప్ చరిత్రలో అతి తక్కువ స్కోర్ బంగ్లాదేశ్ జట్టుపేరుపై ఉంది. 2000లో పాకిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ జట్టు కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది.
– అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 2012లో పాకిస్థాన్ జట్టుపై 183 వ్యక్తిగత స్కోర్ సాధించాడు.
– ఆసియా కప్ చరిత్రలో టాప్ స్కోరర్ గా శ్రీలంక మాజీ ప్లేయర్ జయసూర్య ఉన్నారు. అతను 25 మ్యాచ్ లు ఆడి 1220 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
– ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఉంది. 2010లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్థాన్ 385/7 అత్యధిక స్కోర్ చేసింది.