Salman Ali Agha : ఇంత‌కంటే అవ‌మానం మ‌రొక‌టి ఉండ‌దు చిన్నా.. ‘ఆసియాలో అఫ్గాన్ సెకండ్ బెస్ట్ టీమ్‌..’ పాక్ కెప్టెన్ రియాక్ష‌న్ వైర‌ల్‌..

ఆల్‌రౌండ‌ర్ స‌ల్మాన్ అలీ అఘా(Salman Ali Agha )ను టీ20 కెప్టెన్‌గా నియ‌మించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Pakistan Captain Unmissable Reaction As Afghanistan Labelled 2nd Best Team In Asia

Salman Ali Agha : గ‌త కొన్నాళ్లుగా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్ ప్ర‌ద‌ర్శ‌న చాలా పేల‌వంగా ఉంది. ఆ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయింది. ఈ క్ర‌మంలో ఆసియాక‌ప్ 2025 ఎలాగైనా ఆ జ‌ట్టు స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో పీసీబీ జ‌ట్టులో ప‌లు మార్పులు చేసింది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు బాబ‌ర్ ఆజామ్‌, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ల‌ను ప‌క్క‌న బెట్టింది. ఆల్‌రౌండ‌ర్ స‌ల్మాన్ అలీ అఘా(Salman Ali Agha )ను టీ20 కెప్టెన్‌గా నియ‌మించింది.

జ‌ట్టులో మార్పులు చేసిన‌ప్ప‌టికి కూడా వారి ఇటీవ‌ల ప్ర‌ద‌ర్శ‌న చూసిన‌ప్పుడు పాక్ ఆసియాక‌ప్‌లో పేవ‌రేట్ టీమ్ కాద‌నే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

Asia cup 2025 : టీమ్ మొత్తం కాదు.. ఎవరికి వారే.. సెపరేట్ గా దుబాయ్ వెళ్లనున్న ప్లేయర్లు.. అదేంటంటే బీసీసీఐ చెప్పిన ఆన్సర్ ఇదే..

కాగా.. ఆసియాక‌ప్ ప్రారంభానికి ముందు పాక్ జ‌ట్టు అఫ్గానిస్తాన్‌, యూఏఈతో ట్రై సిరీస్ ఆడుతుంది. శుక్ర‌వారం నుంచి ఈ ట్రైసిరీస్ ప్రారంభం కానుండ‌గా గురువారం విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఇందులో మూడు జ‌ట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ఓ పాక్ విలేక‌రి అఫ్గానిస్థాన్‌ను ప్ర‌శంసించాడు. టీ20 ఛాంపియ‌న్లు టీమ్ఇండియా ఆసియాలో నంబ‌ర్ వ‌న్ కాగా.. రెండో టీమ్ అఫ్గానిస్తాన్‌ అని హైలెట్ చేశాడు. ఈ స‌మ‌యంలో స్టేజీ పైనే ఉన్న పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా కాస్త బాధ‌తో కూడిన న‌వ్వుతో క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కంటే పాక్‌కు మ‌రో అవ‌మానం ఉండ‌దు అని, పాక్ క్రికెట్ ఎంత‌గా దిగ‌జారిందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Mohammed Shami : భారతదేశంలో ముస్లిం క్రికెటర్లను భిన్నంగా చూస్తారా? ష‌మీ ఏమ‌న్నాడంటే.?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2024లో అఫ్గానిస్తాన్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్ల‌ను ఓడించి సెమీఫైన‌ల్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగాటోర్నీలో పాక్ ప‌సికూన అమెరికా చేతిలో ఓడిపోయింది. లీగ్ ద‌శ నుంచే నిష్ర్క‌మించింది.