Pakistan : భార‌త్ చేతిలో ఓట‌మి.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్‌..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ జ‌ట్టు ఖ‌చ్చితంగా సూప‌ర్-8కి చేరుకుంటుంద‌ని ప్ర‌తి ఒక్క క్రీడా పండితుడు చెప్పాడు.

Pakistan Eliminated After Losing to India Super 8 Qualification Scenario

Pakistan Eliminated – T20 World Cup : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ జ‌ట్టు ఖ‌చ్చితంగా సూప‌ర్-8కి చేరుకుంటుంద‌ని ప్ర‌తి ఒక్క క్రీడా పండితుడు చెప్పాడు. అందుకు ప్ర‌ధాన కార‌ణం పాకిస్తాన్ జ‌ట్టు ఉన్న గ్రూపు-ఏలో భారత్‌తో పాటు యూఎస్‌ఏ, ఐర్లాండ్, కెనడా జ‌ట్లు ఉండ‌డం ఓకార‌ణం కాగా.. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో అత్యంత నిల‌క‌డ క‌లిగిన జ‌ట్టుగా పాక్‌కు పేరు ఉండ‌డం మ‌రో కార‌ణం. అయితే.. మెగా టోర్నీ ఆరంభం అయ్యాక సీన్ మారింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే టీమ్ఇండియా ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి సూప‌ర్‌-8 కు ద‌గ్గ‌రైంది.

అనూహ్యంగా అమెరికా రేసులోకి రావ‌డం, అదే స‌మ‌యంలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవ‌డం పాకిస్తాన్ సూప‌ర్-8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేశాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ సూప‌ర్ 8కి చేరాలంటే దాదాపు అద్భుత‌మే జ‌ర‌గాల్సి ఉంది. ఎందుకంటే ఆ జ‌ట్టు చివ‌రి రెండు మ్యాచుల్లో గెలిచిన‌ప్ప‌టికీ కూడా ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల‌పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. గ్రూపు-ఏ నుంచి సూపర్ 8కి వెళ్లే అవ‌కాశాలు ఏ జ‌ట్టుకు ఎలా ఉన్నాయో చూద్దాం..

IND vs PAK : పాక్ పై విజ‌యం.. భార‌త బ్యాట‌ర్ల‌పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. ఒక్క‌రైనా..

టీమ్ఇండియా..
టీమ్ఇండియా వ‌రుస‌గా ఐర్లాండ్‌, పాకిస్తాన్‌ల‌పై విజ‌యాలు సాధించింది. 4 పాయింట్లతో పాటు మెరుగైన ర‌న్‌రేటు(1.455) క‌లిగి గ్రూపు-ఏలో ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో ఉంది. జూన్ 12న అమెరికా, జూన్ 15న కెన‌డాతో టీమ్ఇండియా ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచులో గెలిచిన భార‌త్ సూప‌ర్ 8లోకి అడుగుపెట్ట‌నుంది. అమెరికాతో మ్యాచ్‌లో కాస్త ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉండ‌గా కెన‌డాతో మ్యాచ్‌లో ఈజీగా గెలిచే అవ‌కాశం ఉంది.

అమెరికా..
అతిథ్య జట్టు హోదాలో టోర్నీలో అడుగుపెట్టిన అమెరికా సంచ‌ల‌న ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తుంది. గ‌ట్టి జ‌ట్ల‌కు పోటీస్తుంది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచింది. ముఖ్యంగా పాకిస్తాన్ పై విజ‌యం సాధించ‌డంతో సూప‌ర్ 8కి చేరువైంది. ప్ర‌స్తుతం అమెరికా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. త‌న త‌దుప‌రి రెండు మ్యాచులు భార‌త్‌, ఐర్లాండ్ (జూన్‌14న‌) తో ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో క‌నీసం ఒక్క మ్యాచులో గెలిచినా కూడా అమెరికా సూప‌ర్‌8కి అర్హ‌త సాధిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే.

Babar Azam : భార‌త్‌ పై ఓట‌మి.. పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం కీల‌క వ్యాఖ్య‌లు..

పాకిస్తాన్‌..
ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ ఇంకా పాయింట్ల ఖాతా తెర‌వ‌లేదు. జూన్ 11న కెన‌డాతో, జూన్ 16న ఐర్లాండ్‌తో పాక్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్ భారీ తేడాతో గెలివాల్సి ఉంది. అదే స‌మ‌యంలో అమెరికా, కెన‌డా జ‌ట్లు మిగిలిన మ్యాచుల్లో ఓడిపోతేనే పాకిస్తాన్ సూప‌ర్‌8కి అవ‌కాశం ఉంటుంది.

కెన‌డా..
అమెరికాతో చేతిలో ఓడిపోయిన కెనడా జ‌ట్టు ఐర్లాండ్ పై మాత్రం అద్భుత విజ‌యం సాధించింది. 2 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. జూన్ 11న పాకిస్తాన్‌, జూన్ 15న టీమ్ఇండియాతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల‌ను పెద్ద జ‌ట్ల‌తోనే ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో కెన‌డా సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తే సూప‌ర్‌8 పోరు ఆస‌క్తిక‌రంగా మార‌నుంది.

ఐర్లాండ్‌..
మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ఐర్లాండ్‌కు అవ‌కాశాలు ఉన్నాయి. చివ‌రి రెండు మ్యాచులు జూన్ 14న అమెరికాతో, జూన్ 16న పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే అప్పుడు మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల స‌మీక‌ర‌ణాల ఆధారంగా ఐర్లాండ్‌కు అవ‌కాశాలు ఉంటాయి.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ కామెడీ.. ప‌డిప‌డి న‌వ్విన పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం.. మ్యాచ్ గోవిందా..?

ట్రెండింగ్ వార్తలు