IND vs PAK : పాక్ పై విజయం.. భారత బ్యాటర్లపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఒక్కరైనా..
భారత బ్యాటర్ల ఆటతీరుపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

Sunil Gavaskar Rips Into Rohit Sharma And Co After Batting Collapse vs Pakistan
IND vs PAK – Sunil Gavaskar : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పై భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో గ్రూపు-ఏలో ఉన్న భారత్ నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 119 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో భారత బ్యాటర్ల ఆటతీరుపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
భారత బ్యాటర్ల ప్రదర్శన తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని గవాస్కర్ చెప్పారు. నిర్లక్ష్యంగా ఆడి వికెట్లను పారేసుకున్నారని మండిపడ్డాడు. మ్యాచ్‌ను వారు చాలా తేలికగా తీసుకున్నట్లుగా కనిపించిందన్నాడు. బంతి ఎలా వచ్చినా సరే చాలా సులభంగా కొట్టేస్తామన్న అహంభావంతో ఉన్నారన్నాడు. మ్యాచ్‌లో మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడాలని అనుకున్నట్లుగా ఉన్నారని, అయితే ఇది ఐర్లాండ్ బౌలింగ్ ఎటాక్ కాదన్నాడు.
Babar Azam : భారత్ పై ఓటమి.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం కీలక వ్యాఖ్యలు..
ఓ చిన్న జట్టు పై ఆడుతున్నట్లుగా భావించారు. ఇక్కడ ఐర్లాండ్ను అగౌరపరచాలన్నది తన ఉద్దేశ్యం కాదన్నాడు. పాకిస్తాన్ వంటి అనుభవం కలిగిన ప్రమాదకర బౌలింగ్ యూనిట్‌ను ఆడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. రిషబ్ పంత్ తప్ప ఏ బ్యాటర్ కూడా 20 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోవడం, ఇంకొ ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌట్ అనేది బాధపెట్టే అంశం అని చెప్పాడు. ఆ ఓవర్‌లో కనీసం మరో ఐదు లేదా ఆరు పరుగులు రాబట్టినా ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెరిగేదన్నాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, జడేజా వంటి ఆటగాళ్ల పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల పైనే సూర్యకుమార్ ఆడతాడని ఒకరు అన్నారు. టెస్టులు, ఐపీఎల్ ఆడుకోవాలని రవీంద్ర జడేజాకు ఇంకొకరు సలహా ఇచ్చారు. దూబె కంటే రింకూ సింగ్ ను సెలక్ట్ చేసి ఉంటే బాగుండేదని మరొకరు కామెంట్ చేశారు.
Rohit Sharma : రోహిత్ శర్మ కామెడీ.. పడిపడి నవ్విన పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం.. మ్యాచ్ గోవిందా..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ (42) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది.