Pakistan fined again for slow over-rate in ODI series against Newzeland
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. అయితే.. పాక్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తరువాత వన్డే సిరీస్‌లోనూ వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్ కోల్పోయింది.
వన్డే సిరీస్‌ను కోల్పోయిన బాధలో ఉన్న పాకిస్తాన్ షాక్ తగిలింది. రెండో వన్డేలో పాకిస్తాన్ జట్టు స్లో ఓవర్‌రేటును కొనసాగించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు మ్యాచ్ రిఫరీ పాక్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 5 శాతం ఫైన్ పడింది. పాకిస్తాన్ నిర్ణీత సమయానికి కన్నా ఓ ఓవర్ తక్కువగా వేసింది.
పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నేరాన్ని అంగీకరించాడు. శిక్షను అంగీకరించాడు. దీంతో అధికారిక విచారణ అవసరం లేదని ఐసిసి గురువారం ధృవీకరించింది. కాగా. స్లో ఓవర్‌కు పాల్పడడం ఇది వరుసగా రెండో సారి. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దీంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ పడింది.
వన్డే సిరీస్‌లో పాక్ పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలి వన్డేలో 73 పరుగులతో కోల్పోయిన పాకిస్తాన్ రెండో వన్డేలో 84 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి ఆటగాళ్లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నారు.
ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ శనివారం మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనుంది. కనీసం ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని పాక్ ఆరాటపడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.