Wasim Akram : టెస్టుల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఈజీగా భార‌త్‌ను ఓడిస్తుంది.. వ‌సీం అక్ర‌మ్ కామెంట్స్ వైర‌ల్‌

స్వ‌దేశంలో భార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.

Wasim Akram : టెస్టుల్లో ఇప్పుడు పాకిస్థాన్ ఈజీగా భార‌త్‌ను ఓడిస్తుంది.. వ‌సీం అక్ర‌మ్ కామెంట్స్ వైర‌ల్‌

Pakistan have a chance to beat India in Tests says Wasim Akram

Updated On : November 4, 2024 / 12:02 PM IST

Wasim Akram : స్వ‌దేశంలో భార‌త్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స్పిన్ పిచ్‌ల‌పై భార‌త బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ‌డం పై ఫ్యాన్స్‌లో ఆందోళ‌న నెల‌కొంది. స్వ‌దేశంలోనే ఇలా ఆడితే విదేశాల్లో పరిస్థితి ఏంట‌ని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇదే అదునుగా టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు మైఖేల్ వాన్‌, పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు వసీం అక్రమ్ చేసిన కామెంట్లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు స్పిన్ ట్రాక్‌ల‌ను చూస్తూనే భ‌య‌ప‌డుతోంద‌న్నారు. భార‌త్‌, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్ జ‌రిగితే స్పిన్ వికెట్ల‌పై భార‌త్‌ను పాకిస్థాన్ ఈజీగా ఓడిస్తుంద‌ని అక్ర‌మ్ అన్నాడు.

Wriddhiman Saha : రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు.. న్యూజిలాండ్ పైనే ఆఖ‌రి మ్యాచ్..

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే సిరీస్ జ‌రుగుతోంది. తొలి వ‌న్డే మ్యాచ్‌కు కామెంటేట‌ర్లుగా వ‌సీం అక్ర‌మ్‌, మైఖేల్ వాన్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈక్ర‌మంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఓ సంద‌ర్భంగా భార‌త్, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్‌ను చూడాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. దీనిపై అక్ర‌మ్ మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద విష‌యం. రెండు దేశాలతో పాటు ఆట‌కు ఇది ఎంతో మేలు చేస్తుంద‌న్నాడు.

ఆ త‌రువాత వాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు భార‌త్‌ను పాకిస్థాన్ స్పిన్ పిచ్‌ల‌పై ఓడించ‌గ‌ల‌దు అని అన్నాడు. దీనిపై అక్ర‌మ్ స్పందిస్తూ.. అవును, స్పిన్నింగ్ ట్రాక్‌ల‌లో భార‌త్‌ను ఇప్పుడు పాకిస్థాన్ ఓడించ‌గ‌ల‌దు. ఎందుకంటే ఇటీవ‌లే వారు (భార‌త్‌) స్వ‌దేశంలో న్యూజిలాండ్ పై 3-0 తేడాతో ఓడిపోయారు అని అన్నాడు.

Gautam Gambhir : శ్రీలంక‌, కివీస్‌ చేతుల్లో ఓడిన భార‌త్‌.. ఆసీస్ ప‌ర్య‌ట‌న గంభీర్‌కి అగ్నిప‌రీక్ష‌?

ఇక్క‌డ అక్ర‌మ్ వ్యాఖ్యల‌ను రెండు విధాలుగా తీసుకోవ‌చ్చు. స్వదేశంలో కివీస్ చేతిలో టీమ్ఇండియా వైట్‌వాష్ కావ‌డంతో ఎద్దేవా చేయ‌డం ఒక‌టి కాగా… ఇక పాకిస్థాన్ 0-1తో ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో వెనుక‌బ‌డి ఉన్న‌ప్ప‌టికి 2-1తో టెస్టు సిరీస్ గెల‌వ‌డం రెండోది. తొలి మ్యాచ్ అనంత‌రం పాక్ స్పిన్ పిచ్‌ల‌ను త‌యారు చేయించుకుని ఆడింది. అయితే.. భార‌త్ లాగా కాకుండా మ్యాచ్‌ల‌ను గెల‌వ‌డాన్ని అక్ర‌మ్ ప్ర‌స్తావించాడు.