PAK vs AUS : ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. బాబర్ ఆజామ్‌కు చోటు..
ఆస్ట్రేలియాతో మే 30 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన జట్టును (PAK vs AUS ) ప్రకటించింది.
Pakistan have named 16 member squad for the ODI series against Australia
- మే 30 నుంచి ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య ప్రారంభం కానున్న వన్డే సిరీస్
- ఈ సిరీస్ కోసం 16 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాక్
- రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆటగాళ్లు బాబర్, హారిస్ రౌఫ్, నసీమ్ షా
PAK vs AUS : ఆస్ట్రేలియాతో మే 30 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. షహీన్ షా అఫ్రిది నాయకత్వంలోనే పాక్ జట్టు ఆసీస్‌తో తలపడనుంది. సల్మాన్ అలీ అఘా వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
మార్చిలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపిక కానీ సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజామ్, హారిస్ రౌఫ్, నసీమ్ షా, షాదాబ్ ఖాన్లు ఆసీస్‌తో సిరీస్‌కు చోటు దక్కించుకున్నారు. అహ్మద్ డానియల్, అరఫత్ మిన్హాస్, రోహైల్ నజీర్ లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక అయ్యారు. అనారోగ్యం కారణంగా ఉస్మాన్ ఖాన్ అందుబాటులో లేకపోవడంతో మహమ్మద్ ఘాజీ ఘోరీ, రోహైల్ నజీర్ వికెట్ కీపర్ బ్యాటర్ల స్థానంలో చోటు దక్కించుకున్నారు.
SRH vs RCB : సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫయర్-1 ఆడాలంటే.. ఆర్సీబీపై ఎంత తేడాతో గెలవాలంటే?
Major names return as Pakistan gear up for the home ODI series against Australia 👊https://t.co/hbviC5BHib
— ICC (@ICC) May 22, 2026
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న తరుణంలో తమ జట్టు కూర్పులను మెరుగుపరచుకోవడానికి ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని పాక్ భావిస్తోంది.
ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ఇదే..
షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, మాజ్ సదాకత్, ఘాజీ ఘోరి, నసీమ్ షా, రోహైల్ నజీర్, సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ హుక్సా, షహమిల్ హుఖీన్
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – మే 30న రావల్పిండిలో
* రెండో వన్డే – జూన్ 2న లాహోర్‌లో
* మూడో వన్డే – జూన్ 4న లాహోర్‌లో
