Pakistan pacer Hasan Ali
IPL 2024 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 2024 సీజన్ కోసం సన్నాహలు మొదలయ్యాయి. డిసెంబర్ 19న ఆటగాళ్ల వేలం ప్రక్రియ కొనసాగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఐపీఎల్ లో ఆడాలని ప్రతీఒక్క ప్లేయర్ కు ఉంటుంది. ఎందుకుంటే ఈ టోర్నీలో డబ్బుతో పాటు మంచి క్రేజ్ కూడా సంపాదించుకోవచ్చని ఆటగాళ్లు భావిస్తుంటారు. ఈ టోర్నీలో ఆడేందుకు ప్రపంచ దేశాలకు చెందిన క్రికెటర్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఈ ఐపీఎల్ టోర్నీలో భాగస్వాములయ్యేందుకు పాకిస్థాన్ జట్టుకు అనుమతి లేదు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో పాక్ ఆటగాళ్లు ఆడినప్పటికీ.. ఆ తరువాత ఇరుదేశాల మధ్య రాజకీయపరమైన సంబంధాల కారణంగా పాక్ ప్లేయర్స్ పై నిషేధం విధించారు. దీంతో ఐపీఎల్ టోర్నీలో పాక్ ప్లేయర్లు ఎవరూ కనిపించరు. తాజాగా ఐపీఎల్ టోర్నీపై పాకిస్థాన్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఐపీఎల్ పై మాట్లాడుతూ.. అవకాశం వస్తే నేనుకూడా ఐపీఎల్ లో పాల్గొనాలని ఉందని తన మనసులోని మాటను వెలుబుచ్చాడు. ప్రతి ప్లేయర్ ఐపీఎల్ లో ఆడాలని కోరుకుంటాడు. నాకుకూడా ఆడాలని ఉంది. భవిష్యత్తులో అవకాశం వస్తే కచ్చితగా ఆడతానని హసన్ అలీ తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హసన్ అలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ కు చెందిన పలువురు క్రికెటర్లు ఐపీఎల్ లో అవకాశం వస్తే ఆడతామని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు తరపున హసన్ అలీ ఆడాడు. ఆరు మ్యాచ్ లు ఆడిన హసన్ అలీ.. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఒకే మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీశాడు. ఇదిలాఉంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్2023 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ ఆక్షన్ లో న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ల కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశం ఉంది. రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణించాడు.