మేమింతే మారం..! సహనం కోల్పోయి బ్యాట్‌తో బలంగా కొట్టిన పాక్ ప్లేయర్.. వీడియో వైరల్

పాకిస్థాన్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ అవుట్ కాగానే డ్రెసింగ్ రూంకు వెళ్లాడు. డ్రెస్సింగ్ రూంలో సహనం కోల్పోయి..

Imam Ul Haq

Champions One Day Cup 2024: మేమింతే.. మాలో ఎలాంటి మార్పు ఉండదు.. మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం అనే రీతిలో పాక్ ప్లేయర్లు వ్యవహరిస్తున్నారు. తద్వారా ఒక్కొక్కరు ఒక్కో వివాదంలో చిక్కుకుంటున్నారు. మరికొందరు సహనం కోల్పోయి వింత చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పాక్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ డ్రెస్సింగ్ రూంలో బ్యాట్ ను నేలకేసి బలంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పాక్ ప్లేయర్లు మారరా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Also Read : IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు నో ప్లేస్ అన్న గంభీర్‌..

పాకిస్థాన్ ఛాంపియన్స్ వన్డే డే కప్ 2024 జరుగుతుంది. సెప్టెంబర్ 16న జరిగిన మ్యాచ్ లో లయన్స్ వర్సెస్ పాంథర్స్ టీంలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ జట్టు 283 పరుగులు చేసింది. పాంథర్స్ తరపున ముబాషిర్ ఖాన్ 90 పరుగులతో, హైదర్ అలీ 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. లయన్స్ తరపున ఇమామ్ ఉల్ హక్, సజ్జాద్ అలీ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఒకానొక దశలో లయన్స్ స్కోర్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మరో ఎండ్ లో ఇమామ్ ఉల్ హక్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇమామ, ఇర్ఫాన్ ఖాన్ మధ్య 83 పరుగుల భాగస్వామ్యం లభించింది. అయితే, 23వ ఓవర్లో షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో ఇమామ్ ఉల్ హక్ కట్ షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు.

Also Read : IND vs BAN : ఇదేం పిచ్ రా అయ్యా.. అర్థ‌మైన‌ట్లే ఉంది గానీ.. చెపాక్ పిచ్‌పై బంగ్లాదేశ్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఇమామ్ ఉల్ హక్ అవుట్ కాగానే డ్రెసింగ్ రూంకు వెళ్లాడు. డ్రెస్సింగ్ రూంలో సహనం కోల్పోయి బ్యాట్ ను బలంగా నేలకేసి కొట్టి తీవ్ర అసహనాన్ని వ్యక్తపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇమామ్ ఔట్ అయిన తరువాత లయన్స్ జట్టు 56 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయి 199 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 84 పరుగుల భారీ తేడాతో పాంథర్స్ జట్టుపై ఓటమి పాలైంది.