Pakistan Shaheens clinch Asia Cup Rising Stars 2025 title in Super Over
Asia Cup Rising Stars 2025 : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 విజేతగా పాకిస్తాన్ షాహిన్స్ నిలిచింది. ఆదివారం దోహా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్-ఏ పై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. సాద్ మసూద్ (38; 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అర్ఫత్ మిన్హాస్(25; 23 బంతుల్లో 4 ఫోర్లతో 25), మాజ్ సదకత్( 23; 18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్) లు రాణించారు. బంగ్లా బౌలర్లలో రిపన్ మోండల్ మూడు వికెట్లు తీశాడు. రకిబుల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫర్ సక్లెయిన్ తలా వికెట్ సాధించారు.
Rishabh Pant : రిషబ్ పంత్‌కు వన్డే కెప్టెన్సీ ఇవ్వకపోవడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?
ఆ తరువాత 126 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 125 పరుగులే చేసింది. బంగ్లా బ్యాటర్లలో హబిబుర్ రెహ్మాన్ సోహన్(26; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రకిబుల్ హసన్(24; 21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో సుఫియన్ ముఖీమ్ మూడు వికెట్లు తీశాడు. అర్ఫత్ మిన్హాస్, అహ్మద్ దనియల్ చెరో రెండు వికెట్లు తీశారు.
సూపర్ ఓవర్..
ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 6 పరుగులు చేసింది. (సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే ఆలౌట్‌గా పరిగణిస్తారు అన్న సంగతి తెలిసిందే.) 7 పరుగుల లక్ష్యాన్ని పాక్ వికెట్ కోల్పోయి నాలుగు బంతుల్లో ఛేదించి ఆసియా కప్ విజేతగా నిలిచింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. ఓపెనర్ మాజ్ సదఖత్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.