Pakistan womens head coach Muhammad Wasim removed after World Cup debacle
Muhammad Wasim : ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో ఫాతిమా సనా నేతృత్వంలో పాక్ ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోగా, మరో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో కనీసం ఒక్కటంటే ఒక్క విజయం లేకుండా పాక్ ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఆఖరి స్థానంలో పాక్ నిలిచింది.
ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ మహిళా జట్టు హెడ్ కోచ్ ముహమ్మద్ వసీం(Muhammad Wasim)ను తొలగించింది. ‘ప్రపంచ కప్‌తో వసీం ఒప్పందం ముగిసిందని, దానిని పొడిగించకూడదని, బదులుగా కొత్త ప్రధాన కోచ్‌ను నియమించాలని నిర్ణయించినట్లుగా’ పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
SRH : ఐపీఎల్ 2026 ముందు సన్‌రైజర్స్ కీలక నిర్ణయం..! వేలంలోకి హెన్రిచ్ క్లాసెన్?
మాజీ టెస్ట్ ఆటగాడు, పురుషుల జట్లకు చీఫ్ సెలెక్టర్‌గా కూడా పనిచేసిన వసీం గత సంవత్సరం మహిళా జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అతడి పదవీకాలంలో పాకిస్తాన్ జట్టు ఆసియా కప్ సెమీఫైనల్స్‌లో ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ 2024లో లీగ్ దశలోనే నిష్ర్కమించింది.
ప్రస్తుతం పీసీబీ విదేశీ కోచ్ కోసం వెతుకుతోంది. అయితే తగిన అభ్యర్థి దొరకకపోతే, మాజీ మహిళా జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ ను హెడ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదండోయ్ జట్టులోని మిగిలిన సహాయక సిబ్బందిని త్వరలోనే మార్చనున్నట్లు తెలుస్తోంది.