పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఇంగ్లీష్ కౌంటీ టీమ్ సోమర్సెట్‌కు తన జెర్సీ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌లో జరిగుతున్న టీ 20 బ్లాస్ట్ లీగ్‌లో ఆడుతున్న బాబర్ మద్యం కంపెనీ లోగోను తన చొక్కా మీద వేసుకోనని ఆ టీమ్ యజమాన్యానికి క్లారిటీ ఇచ్చేశారు. పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తరువాత బాబర్ సోమర్సెట్‌తో కలిసి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతున్నాడు.
అతను గత మ్యాచ్లో మద్యం కంపెనీ లోగోతో ఉన్న జెర్సీ వేసుకుని కనిపించాడు. అయితే ఈ విషయంలో బాబర్ సోషల్ మీడియాలో విమర్శల పాలయ్యారు. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 అంతర్జాతీయ సిరీస్ ముగిసిన తర్వాత బాబర్ సోమర్‌సెట్ కోసం మొదటి మ్యాచ్ ఆడాడు. ఈ సమయంలోనే అసలు వివాదం ప్రారంభం అయ్యింది. వాస్తవానికి, సోమర్‌సెట్ జెర్సీకి స్పాన్సర్షిప్ లోగో ఉంది, వాటిలో ఒకటి ఆల్కహాల్ బ్రాండ్. అదే లోగోను బాబర్ జెర్సీపై కూడా ఉంచారు. అయితే దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మండిపడ్డారు.
Tribute to @amlahash @TheRealPCB should notice that.#babarazam https://t.co/C7ObHG6nS9
— Muhammad saqib saeed (@saqibsaeed846) September 3, 2020
వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ 42 పరుగులు చేశాడు. బాబర్ జెర్సీలో మద్యం కంపెనీ లోగోను చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లోగో అనుకోకుండా బాబర్ జెర్సీలో ఉంచబడిందని తరువాత తెలిసింది. వచ్చే మ్యాచ్ నుంచి బాబర్ అజామ్ జెర్సీలో ఈ లోగో కనిపించదని సోమర్సెట్ స్పష్టం చేసింది.
SOMERSET WIN BY 16 RUNS!!!! ????#WORCvSOM #WeAreSomerset pic.twitter.com/MQlfZc9fxh
— Somerset Cricket ? (@SomersetCCC) September 3, 2020
సోమర్సెట్ తరఫున ప్రారంభ మ్యాచ్‌లో బాబర్ 35 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఓపెనర్ స్టీవెన్ డేవిస్ 60 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ రెండింటిలోనూ సోమెర్‌సెట్ వోర్సెస్టర్‌షైర్ ముందు 20 ఓవర్లలో 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో వోర్సెస్టర్‌షైర్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. గతేడాది వైటాలిటీ బ్లాస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన బాబర్, 149.35 స్ట్రైక్ రేట్‌తో 52.54 సగటుతో 578 పరుగులు చేశాడు.
https://10tv.in/cannabis-rains-on-tel-aviv/
The sponsors logo for a brand of alcohol on Babar Azam’s Somerset shirt was left on in error. Somerset will be removing the logo before their next match in the T20 Blast #Cricket #VitalityBlast pic.twitter.com/yEQO9Y4EPd
— Saj Sadiq (@Saj_PakPassion) September 3, 2020