PAKW Vs INDW: పాకిస్థాన్‌పై టీమిండియా విజయ దుందుభి

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విమెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

@BCCIWomen and ICC

టీ20 విమెన్ ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ జట్టును టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విమెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

టీమిండియా విమెన్ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడి 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయ దుందుభి మోగించింది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇది ఐదో విజయం.

పాకిస్థాన్‌ మహిళల జట్టులో మునీబా అలీ 17, నిదా దార్ 28 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత మహిళల జట్టులో షఫాలీ వర్మ 32, జెమిమా 23, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 29 పరుగులు బాదారు.

టీ20 విమెన్ ప్రపంచకప్‌ పాయింట్ల పట్టిక

India vs Bangladesh: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌.. జట్టులోకి మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం