Kaia Arua : క్రికెట్‌లో పెను విషాదం.. ఆల్ రౌండ‌ర్ అరువా మృతి.. శోకసంద్రంలో ఆసియా-పసిఫిక్ క్రికెట్

క్రికెట్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ప‌పువా న్యూ గినియా ఆల్‌రౌండర్ కాయ అరువా మ‌ర‌ణించింది.

క్రికెట్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ప‌పువా న్యూ గినియా ఆల్‌రౌండర్ కాయ అరువా మ‌ర‌ణించింది. ఆమె వ‌య‌స్సు 33 సంవ‌త్స‌రాలు. ఆమె మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఆమె చ‌నిపోయిన విష‌యాన్ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ధృవీక‌రించింది. ఆమె ఇక లేరు అనే వార్త తెలిసి తూర్పు ఆసియా-పసిఫిక్ క్రికెట్ సంఘం శోకసంద్రంలో మునిగిపోయింది.

కాయ అరువా 2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. త‌న ప్ర‌తిభ‌తో త‌క్కువ కాలంలో మంచి ఆల్‌రౌండ‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. లెఫ్టామ్ రిస్ట్ స్పిన్న‌ర్ అయిన అరువా ప‌పువా న్యూ గినియా జ‌ట్టు త‌రుపున 47 టీ20 మ్యాచులు ఆడింది. 59 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఇందులో నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న మూడు సార్లు, ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న రెండు సార్లు చేసింది. అత్యుత్త‌మ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న 5/7. అటు బ్యాటింగ్‌లో 341 ప‌రుగులు చేసింది.

AB de Villiers : ఆర్‌సీబీ గెలుపు బాట ప‌ట్టాలంటే.. కోహ్లి చేయాల్సింది అదే : ఏబీ డివిలియ‌ర్స్

ఆమె కెప్టెన్‌గా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టింది. వంద‌శాతం స‌క్సెస్ రేటుతో మ్యాచ్‌ల‌ను గెలిచింది. మొత్తంగా ఆమె 29 టీ20 మ్యాచుల్లో సార‌థ్యం వ‌హించ‌గా అన్ని మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల క్రికెట్ అభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేసింది. ప‌పువా న్యూ గినియా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డు ఆమె పేరిటే ఉంది.

Ishan Kishan : సూప‌ర్‌మ్యాన్ గెట‌ప్‌లో ఇషాన్ కిష‌న్‌.. భ‌లే శిక్ష వేశారు బాసూ!