Ishan Kishan : సూపర్‌మ్యాన్ గెటప్‌లో ఇషాన్ కిషన్.. భలే శిక్ష వేశారు బాసూ!
వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మాత్రం సూపర్ మ్యాన్ గెటప్‌లో కనిపించాడు.

Why is Ishan Kishan wearing Superman Outfit
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ గెలుపు బోణీ కొట్టలేదు. మూడు మ్యాచులు ఆడగా అన్నింటిలోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ముంబై తన తదుపరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. వాంఖడే వేదికగా ఏప్రిల్ 7 ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై సిద్ధమవుతోంది.
మ్యాచ్‌కు మరో రెండు రోజులు సమయం ఉండడంతో ఆటగాళ్లకు ఆటవిడుపు కోసం ముంబై యాజమాన్యం ప్లేయర్లను డామన్ అండ్ డయ్యూ పంపినట్లుగా తెలుస్తోంది. గురువారం ముంబై ఆటగాళ్లు ఎయిర్‌పోర్టులో కనిపించారు. మిగిలిన అందరూ టీమ్ జెర్సీలోనే కనిపించగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మాత్రం సూపర్ మ్యాన్ గెటప్‌లో కనిపించాడు. మీడియాకు కూడా ఆ గెటప్‌లోనే ఫోజులు ఇచ్చాడు. ఏదో సరదాకి అతడు ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడని మీరు భావిస్తే అది ముమ్మాటికీ తప్పే..
IPL 2024 : మాయ చేసిన గంభీర్.. అగ్రస్థానానికి కేకేఆర్.. కోహ్లీ, రోహిత్ టీమ్‌లు ఎక్కడంటే?
ఆలస్యంగా రావడంతో..
జట్టు సమావేశాలకు ఆలస్యంగా వస్తుండడంతో ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌కు శిక్ష విధించింది. ఈ పనిష్‌మెంట్‌లో భాగంగానే అతడు సూపర్ మ్యాన్ గెటప్‌లో కనిపించాడు. MI నియమం ప్రకారం.. టీమ్ మీటింగ్‌కు ఆలస్యంగా వచ్చే ఏ ఆటగాడైనా తదుపరిసారి ఎక్కడికైనా వెళ్లినప్పుడు సూపర్‌మ్యాన్ సూట్‌ను ధరించాల్సి ఉంటుంది.
POV: ???? ???? ???? ????????? ???? ??? ????????????? ???? ????? ?? ????? ??? ??
Tag that friend who is always late, everywhere! ?#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/yb7nz6aOHQ
— Mumbai Indians (@mipaltan) April 3, 2024
సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు కిషన్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా శిక్ష పడింది. షామ్స్ ములానీ, కుమార్ కార్తికేయ, శ్రీలంక పేసర్ నువాన్ తుషార లు సైతం సూపర్ మ్యాన్ గెటప్‌లో కనిపించారు. వీరు సూపర్‌మ్యాన్ గెటప్‌లో కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
IPL 2024 : కేకేఆర్ యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఎవరు?
Punishment dene ka tareeka kaafi k̴e̴z̴u̴a̴l̴ strict hai ??#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/pMRz9jqcEd
— Mumbai Indians (@mipaltan) April 3, 2024