AB de Villiers : ఆర్‌సీబీ గెలుపు బాట ప‌ట్టాలంటే.. కోహ్లి చేయాల్సింది అదే : ఏబీ డివిలియ‌ర్స్

ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం నిరాశ ప‌ర‌చ‌డం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు అల‌వాటుగా మారింది.

AB de Villiers : ఆర్‌సీబీ గెలుపు బాట ప‌ట్టాలంటే.. కోహ్లి చేయాల్సింది అదే : ఏబీ డివిలియ‌ర్స్

AB de Villiers Honest Message Over RCB Poor Show

AB de Villiers – RCB : ప్ర‌తీసారి క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం నిరాశ ప‌ర‌చ‌డం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు అల‌వాటుగా మారింది. క‌నీసం ఈ సీజ‌న్‌లోనైనా 16 ఏళ్ల లోటు తీరుతుంద‌ని అభిమానులు అంద‌రూ ఎంతో ఆశ‌తో ఉన్నారు. అయితే.. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో నాలుగు మ్యాచులు ఆడ‌గా ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది ఆర్‌సీబీ. మూడు మ్యాచుల్లో ఓడి పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ఆర్‌సీబీ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి మాత్రం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో 67.66 స‌గ‌టుతో 203 ప‌రుగులు చేశాడు. ప్ర‌స్తుతం ఆరెంజ్ క్యాప్ అత‌డి వ‌ద్దే ఉంది. ఆర్‌సీబీ విజ‌యాల ప‌ట్టేందుకు ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ ఓ కీల‌క సూచ‌న చేశాడు. కోహ్లి 15వ ఓవ‌ర్‌ వ‌ర‌కు క్రీజులో ఉండాల‌న్నాడు. అదే స‌మ‌యంలో పవ‌ర్లే ప్లేలో డుప్లెసిస్ రిస్క్ తీసుకోవ‌డంతో పాటు మ‌రింత బాధ్య‌తాయుతంగా ఆడాల‌న్నాడు.

IPL 2024 : కేకేఆర్ POTM అవార్డుల ఎలైట్ జాబితాలో సునీల్ నరైన్.. ర‌సెల్ రికార్డు స‌మం

డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. కోహ్లి మంచి ఆరంభాల‌ను భారీ స్కోర్లుగా మ‌ల‌చాలి. అత‌డు త‌న జోరును మిడిల్ ఓవ‌ర్ల‌లోనూ కొన‌సాగించాలి. డుప్లెసిస్ ప‌వ‌ర్ ప్లేలో రిస్క్ తీసుకోవ‌డంతో పాటు బాధ్య‌తాయుతంగా ఆడాలి. ఆరు నుంచి 15 ఓవ‌ర్ల మ‌ధ్య కోహ్లి బ్యాటింగ్ చేయాలి. అలా జ‌రిగితే ఆర్‌సీబీ భారీ స్కోర్లు సాధిస్తుంది. అని ఏబీడీ అన్నాడు.

ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ పేల‌వ‌మైన ప్రారంభాలు చేయ‌లేదు, అలాగ‌నీ గొప్ప ఆరంభాలు కూడా కావు. స‌మ‌స్య మొత్తం మిడిల్‌లోనే ఉంది. ఆర్‌సీబీకీ ఇప్పుడు విజ‌యాలు కావాలి. ఓ రెండు విజ‌యాలు సాధిస్తే.. గెలుపు బాట పట్ట‌డం పెద్ద క‌ష్టం ఏమీ కాదు. అని డివిలియ‌ర్స్ అన్నాడు. బెంగ‌ళూరు త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు జైపూర్ వేదిక కానుంది.

IPL 2024 : మాయ చేసిన గంభీర్‌.. అగ్ర‌స్థానానికి కేకేఆర్‌.. కోహ్లీ, రోహిత్ టీమ్‌లు ఎక్క‌డంటే?

ఏబీ డివిలియర్స్ 2011-2021 మధ్యకాలంలో ఆర్‌సీబీ త‌రుపున ఐపీఎల్‌లో ఆడాడు. 157 మ్యాచ్‌ల్లో 41.10 సగటుతో 4,522 పరుగులు చేశాడు. 158 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ క‌లిగి ఉన్నాడు. రెండు సెంచ‌రీలు, 37 అర్థ‌శ‌త‌కాలు అత‌డిపేరిట ఉన్నాయి.