IPL 2024 : కేకేఆర్ POTM అవార్డుల ఎలైట్ జాబితాలో సునీల్ నరైన్.. ర‌సెల్ రికార్డు స‌మం

ఐపీఎల్‌ 2024లో భాగంగా బుధ‌వారం విశాఖ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

IPL 2024 : కేకేఆర్ POTM అవార్డుల ఎలైట్ జాబితాలో సునీల్ నరైన్.. ర‌సెల్ రికార్డు స‌మం

Photo Credit @ KKR Twitter

ఐపీఎల్‌ 2024లో భాగంగా బుధ‌వారం విశాఖ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కేకేఆర్ విజ‌యంలో సునీల్ న‌రైన్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న అత‌డు 7 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 85 ప‌రుగుల విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అత‌డు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

కాగా.. ఐపీఎల్‌లో కేకేఆర్ త‌రుపున 14వ సారి న‌రైన్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఆండ్రీ ర‌సెల్ రికార్డును స‌మం చేశాడు. కోల్‌క‌తా త‌రుపున అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆట‌గాళ్ల జాబితాలో ఆండ్రీ ర‌సెల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 14 సార్లు ఈ అవార్డును అందుకోగా తాజాగా న‌రైన్ సైతం అన్నే సార్లు అందుకున్నాడు. వీరిద్ద‌రి త‌రువాత కోల్‌క‌తా ప్ర‌స్తుత మెంటార్ గౌతమ్ గంభీర్‌(10) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Ishan Kishan : సూప‌ర్‌మ్యాన్ గెట‌ప్‌లో ఇషాన్ కిష‌న్‌.. భ‌లే శిక్ష వేశారు బాసూ!

ఇక ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ పేరిట ఉంది. డివిలియ‌ర్స్ ఆర్‌సీబీ త‌రుపున 25 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఆ త‌రువాత క్రిస్‌గేల్ (22), రోహిత్ శ‌ర్మ (19), డేవిడ్ వార్న‌ర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి(17), షేన్ వాట్స‌న్ (16), యూస‌ఫ్ ప‌ఠాన్ (16) లు ఉన్నారు. ఈ జాబితాలో ర‌సెల్ 10వ, న‌రైన్ 11వ స్థానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 272 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో కోల్‌క‌తా 106 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2024 : మాయ చేసిన గంభీర్‌.. అగ్ర‌స్థానానికి కేకేఆర్‌.. కోహ్లీ, రోహిత్ టీమ్‌లు ఎక్క‌డంటే?