హార్ధిక్, బుమ్రాలు ముంబై జట్టులో కొనసాగడానికి రోహిత్ శర్మనే కారణం.. పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు

పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్.. జట్టులోని ప్లేయర్స్ కు మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటాడు.

Rohit Sharma

IPL 2024 : ఐపీఎల్ -2024 టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఈనెల 22న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలిపోరు జరుగుతుంది. అయితే, ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తొలగించింది. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ముంబై ఇండియన్స్ జట్టు ఒకప్పటి ప్లేయర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Also Read : Rishabh Pant : ప్రాక్టీస్ సెష‌న్‌లో సిక్సర్ల మోతమోగించిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్.. జట్టులోని ప్లేయర్స్ కు మద్దతుగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇందుకు నిదర్శనం బుమ్రా, హార్దిక్ పాండ్యాల వ్యవహారమే. 2014లో ముంబై జట్టులోకి బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అతనికి 2015లో ఆడే అవాకశం దక్కింది. ఆశించిన స్థాయిలో బుమ్రా బౌలింగ్ వేయలేక పోయాడు. దీంతో ముంబై జట్టు యాజమాన్యం అతన్ని పక్కన పెట్టాలని భావించింది. కానీ, రోహిత్ శర్మ ఒప్పుకోలేదు. యాజమాన్యంను ఒప్పించిమరీ 2016 ఐపీఎల్ లో బుమ్రాను కొనసాగించాడు. ఆ సీజన్ లోబుమ్రా చెలరేగిపోయి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇదే తరమాలో హార్ధిక్ పాండ్యా విషయంలో జరిగింది.

Also Read : రంజీట్రోఫీ విజేత ముంబై.. 42వ సారి టైటిల్ కైవసం

హార్ధిక్ పాండ్యా మొదట్లో ముంబై ఇండియన్స్ జట్టులోని ఆడాడు. అతను 2015 సీజన్ లో జట్టులోకి వచ్చాడు. అయితే, 2016లో అతని ప్రదర్శన పేలవంగా ఉండటంతో యాజమాన్యం అతన్ని తప్పించేందుకు నిర్ణయించింది. కానీ, రోహిత్ శర్మ అందుకు ఒప్పుకోలేదు. హార్దిక్ ముంబై జట్టులోనే ఉండాలని, అతను ఖచ్చితంగా మంచి ప్రదర్శన ఇస్తాడని యాజమాన్యంకు హార్దిక్ నచ్చజెప్పాడు. రోహిత్ ఎప్పుడూ జట్టు సభ్యులకు అండగా నిలుస్తూ వస్తాడు. ఒకటిరెండు సార్లు పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలో విఫలమైనప్పటికీ వారికి రోహిత్ అండగా నిలుస్తూ వారు తరువాత మ్యాచ్ లో మంచి ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహిస్తాడు అంటూ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు