Pat Cummins cheeky reply to which Indian player can slot into Australia team
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుత భారత జట్టులో ఒక్కరికి కూడా ఆసీస్ జట్టులో ఆడే అర్హత లేదన్నాడు. దీనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు నాథన్ లైయాన్, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్‌లు పాల్గొన్నారు. ప్రస్తుత టీమ్ఇండియా ఆటగాళ్లలోంచి ఎవరైనా ఒకరిని ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకోవాల్సి వస్తే.. ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్న వారికి ఎదురైంది. విరాట్ కోహ్లీని లైయాన్, రిషభ్ పంత్‌ను మిచెల్ మార్ష్, రోహిత్ శర్మను ట్రావిస్ హెడ్ ఎంచుకుంటామని చెప్పారు.
Umpire Injury : అరెరె.. ఎంత పనాయెరా.. స్ట్రెయిట్ డ్రైవ్ ఇలా ఆడతారా.. ఆసీస్ అంపైర్ ముఖం పగిలింది..
అయితే.. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాత్రం ఒక్కరు కూడా లేరు అని సమాధానం ఇచ్చాడు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి. ఆసీస్ జట్టుకు ఎంపిక అయ్యే సామర్థ్యం భారత ఆటగాళ్లకు ఎవ్వరికి లేదని అంటావా అంటూ భారత అభిమానులు అతడిపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇరు జట్లు పెర్త్‌కు చేరుకున్నాయి. ఐదు మ్యాచుల సిరీస్‌లో తొలి టెస్టులో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Yashasvi Jaiswal : తొలి ఆసీస్ పర్యటనపై యశస్వి జైస్వాల్.. గోల్డెన్ సలహా ఇచ్చిన కోహ్లీ..