Yashasvi Jaiswal : తొలి ఆసీస్ పర్యటనపై యశస్వి జైస్వాల్.. గోల్డెన్ సలహా ఇచ్చిన కోహ్లీ..
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చాలా తక్కువ సమయంలోనే కీలక ప్లేయర్‌గా ఎదిగాడు.

Ahead Of First Australia Tour Jaiswal Given Golden Advice By Kohli
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చాలా తక్కువ సమయంలోనే కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఫార్మాట్ ఏదైన సరే తనదైన శైలిలో రాణిస్తున్నాడు. తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన యశస్వి.. ఆసీస్ పిచ్‌లపై ఎలా రాణిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ యువ ఆటగాడి పై టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రభావం ఎంతో ఉందట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.. జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో కోహ్లీతో ఎక్కువగా మాట్లాడేవాడినని అన్నాడు. మూడు ఫార్మాట్లలో ఇన్నేసి మ్యాచులు ఆడుతూ ఎలా రాణిస్తున్నావు అని అడిగాను. అప్పుడు కోహ్లీ ఇలా అన్నాడు. నేను మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటాను కాబట్టి. నా దినచర్య కూడా ఓ పద్దతిగా ఉండాలి. క్రమశిక్షణ అత్యంత కీలకం అని చెప్పాడు. ఇక అప్పటి నుంచి కోహ్లీని ఏం చేస్తున్నాడో అని గమనించేవాడిని. అలా చూడడంతో అతడి ప్రభావం నాపై పడిందనిపించేది. నా అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ప్రతి రోజు మెరుగు అవుతూ వచ్చానని యశస్వి చెప్పాడు.
ఆసీస్ పర్యటన గురించి..
ఆస్ట్రేలియాలో పర్యటించడం యశస్వి జైస్వాల్‌కు ఇదే తొలిసారి. దీనిపై మాట్లాడుతూ.. ఇదే నా తొలి ఆసీస్ పర్యటన. ఇక్కడ మ్యాచులు ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మానసికంగా ఇప్పటికే సన్నద్ధం అయ్యాను అని చెప్పాడు.
ఆసీస్ పిచ్‌లు కఠినంగా ఉంటాయని అంటుంటారని, ప్రత్యక్షంగా ఆడే అవకాశం వచ్చిందన్నాడు. సవాళ్లను ఎదుర్కొంటూ ఆటను ఆస్వాదిస్తానని చెప్పాడు. ఇక్కడ వచ్చిన అవకాశాన్ని నేర్చుకునేందుకు సద్వినియోగం చేసుకుంటానని తెలిపాడు.
ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున యశస్వి జైస్వాల్ 14 టెస్టులు ఆడాడు. 56.28 సగటుతో 70.13 స్ట్రైక్ రేట్‌తో 1407 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, ఎనిమిది అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 214*.
రేపు (నవంబర్ 22 శుక్రవారం) నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
The desire to play, the learnings from @imVkohli and the motivation to enjoy the challenge Down Under 👌👌
𝘽𝙚𝙞𝙣𝙜 𝙔𝙖𝙨𝙝𝙖𝙨𝙫𝙞 out NOW on https://t.co/Z3MPyeL1t7!
WATCH 🎥🔽 – By @RajalArora | #TeamIndia | #AUSvIND | @ybj_19https://t.co/BFcB5LUJ3n
— BCCI (@BCCI) November 21, 2024