IND vs AUS: మహ్మద్ షమీ ఆస్ట్రేలియాకు వెళ్తున్నాడా..! కీలక విషయాన్ని చెప్పిన కెప్టెన్ జస్ర్పీత్ బుమ్రా

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో మహ్మద్ షమీ ఆడే విషయంపై బుమ్రా మాట్లాడారు. షమీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. మేనేజ్ మెంట్ అతని ఆటతీరును..

IND vs AUS: మహ్మద్ షమీ ఆస్ట్రేలియాకు వెళ్తున్నాడా..! కీలక విషయాన్ని చెప్పిన కెప్టెన్ జస్ర్పీత్ బుమ్రా

Jasprit Bumrah

Updated On : November 21, 2024 / 12:59 PM IST

Jasprit Bumrah: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు ఈనెల 22న (శుక్రవారం) ఉదయం 7.50గంటలకు పెర్త్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు పాంట్ కమిన్స్, జస్ర్పీత్ బుమ్రా ట్రోపీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జస్ర్పీత్ బుమ్రా మాట్లాడారు. పెర్త్ టెస్టు మ్యాచ్ లో తానే నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశాడు. నేను రోహిత్ శర్మతో మాట్లాడాను. కానీ, ఆస్ట్రేలియా మేము వచ్చే సమయంలో రోహిత్ విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు నాకు స్పష్టత వచ్చింది. కోచ్ గౌతమ్ గంభీర్, మేనేజ్ మెంట్ పెర్త్ టెస్టులో నాయకత్వం వహించేది నేనే అని క్లారిటీ ఇచ్చారని బుమ్రా అన్నారు. రోహిత్ శర్మ మా కెప్టెన్. అతను అద్భుతమైన నాయకుడు అంటూ బుమ్రా చెప్పాడు.

Also Read: IND vs AUS: భారత్‌తో మ్యాచ్ అంటే మాపైనా ఒత్తిడి ఉంటుందన్న పాట్ కమిన్స్.. నితీశ్ రెడ్డి గురించి ఏం చెప్పాడంటే?

విరాట్ కోహ్లీ గురించి మీడియా ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీ మా జట్టులోని సీనియర్ ప్లేయర్లలో ఒకరు. నేను విరాట్ కెప్టెన్సీలోనే అరంగ్రేటం చేశాను. విరాట్ కు నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అతను గొప్ప ప్లేయర్ అని అందరికీ తెలుసు. ఒకటి రెండు సిరీస్ లలో ఫామ్ లో లేనంతమాత్రాన అతన్ని తక్కువ చేసి చూడాల్సిన పనిలేదు. ఆసీస్ తో సిరీస్ లో కోహ్లీ రాణిస్తాడన్న విశ్వాసం ఉందని బుమ్రా అన్నాడు. అదేవిధంగా.. కెప్టెన్సీ బాధ్యతలపై బుమ్రా మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ఆడటం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదు. ఫాస్ట్ బౌలర్ల నాయకత్వంలోనూ జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. పాట్ కమిన్స్ విజయవంతం అయ్యాడు. కపిల్ దేవ్ ఇంతుకు ముందు మనం చూశాం. ఇది కొత్త ట్రెండ్ కు నాంది అని ఆశిస్తున్నాను అని బుమ్రా పేర్కొన్నాడు.

Also Read: Mohammed Shami: టీమిండియా మాజీ క్రికెటర్ పై మహ్మద్ షమీ తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే?

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో మహ్మద్ షమీ ఆడే విషయంపై బుమ్రా మాట్లాడారు. షమీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. మేనేజ్ మెంట్ అతని ఆటతీరును, ఫిట్ నెస్ ను నిశితంగా గమనిస్తోంది. త్వరలో ఈ సిరీస్ లో అతడు భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయని బుమ్రా పేర్కొన్నారు. పెర్త్ టెస్టులో ఎవరెవరు బరిలోకి దిగబోతున్నారనే విషయంపై బుమ్రా మాట్లాడుతూ.. పెర్త్ టెస్టు కోసం భారత్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పటికే ఖరారైంది. శుక్రవారం ఆట ప్రారంభానికి ముందు ఎవరెవరు జట్టులో ఉన్నారనే విషయం మీకు తెలుస్తుందని బుమ్రా అన్నాడు.